close

తాజా వార్తలు

చెట్టు లోపల మంటలు.. వీడియో వైరల్‌

దిల్లీ: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొన్న సందర్భాల్లో ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. అది విని అరె! ఎక్కడో పిడుగు పడినట్టుందే! అని అనుకుంటాం. అయితే ఆ పిడుగు ఓ చెట్టుపై పడితే ఆ చెట్టును పూర్తిగా ధ్వంసం చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పిడుగుపాటుతో అనుకోకుండా చోటుచేసుకునే కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మన కళ్ల ముందు ఆ దృశ్యం కనిపించినప్పటికీ అది నిజమా కాదా?అని నమ్మలేకుండా ఉన్న సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్ అవుతోంది.

పిడుగుపాటుకు గురైన ఓ చెట్టు బయటి భాగం ఏమాత్రం చెక్కుచెదరలేదు. కేవలం లోపలి భాగంలో మాత్రం మంటలు వ్యాపించాయి. అక్టోబర్‌ 20న షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 74 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 3.6 లక్షల మంది దీన్ని లైక్‌ చేయగా.. 93 వేల రీట్వీట్లకు చేరువలో ఉంది. ఈ వీడియోను చూసిన కొందరు విస్మయానికి గురవుతున్నారని.. మరికొందరు నమ్మలేకపోతున్నామని.. ఇక మరికొందరైతే ‘లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌’ హాలీవుడ్‌ సినిమాలోని ‘గ్రేట్‌ ఐ’తో పోల్చుతూ రీట్వీట్‌ చేస్తున్నారు.

 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.