close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. విలీనం మినహా 21 డిమాండ్ల పరిశీలన

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు మినహా కార్మిక సంఘాల ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన అయిదుగురు అధికారులతో కమిటీని నియమించింది. ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్‌కుమార్‌, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లుతో పాటు ఆర్థిక సలహాదారు ఎన్‌.రమేశ్‌లు ఇందులో ఉన్నారు. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మళ్లీ చంద్రబాబు గెలిస్తే బాగుండేది

రాజధాని అంతా ఒక చోట ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని గుంటూరు లోక్‌సభ సభ్యుడు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారని, మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడుతున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘పెద్దాసుపత్రికి వెళ్లండి’ అనలేరిక

ఏ ఆసుపత్రి అయినా స్థాయికి తగ్గట్లుగా వైద్యసేవలు అందించాలనే లక్ష్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆయా ఆసుపత్రుల్లో వైద్యులను నియమించినా సేవలందించకుండా పైస్థాయి ఆసుపత్రికి పంపించే ఉదాసీన వైఖరికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఒకవేళ రోగికి ఆయా ఆసుపత్రుల్లో లభిస్తున్న వాటి కంటే మెరుగైన సేవలు అవసరమని భావిస్తే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ పైస్థాయి ఆసుపత్రికి యథాలాపంగా రోగులను పంపించే ప్రస్తుత విధానానికి అడ్డుకట్ట వేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నా భర్తను, కుటుంబాన్ని ఎస్పీ టార్గెట్‌ చేశారు: అఖిల ప్రియ

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తమ కుటుంబంపై అక్రమకేసులు పెట్టి హింసిస్తున్నారని మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. మంగళవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ... యురేనియంతో జరిగే నష్టాలను తెలుసుకునేందుకు కడప జిల్లా పులివెందులకు వెళ్లి వచ్చిన రెండు రోజులకే తన భర్త భార్గవరామ్‌పై కేసులు పెట్టారన్నారు. ఎలాంటి వారెంట్‌ లేకుండా పోలీసులు హైదరాబాద్‌లోని తన ఇంట్లో సోదాలు చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రామగిరి ఖిల్లాలో మధ్యరాతి యుగం చిత్రాలు

పెద్దపల్లి జిల్లాలోని రామగిరిఖిల్లాలో గుహల అవతలి వైపు గీర బొమ్మలు (పెట్రోగ్లైఫ్స్‌) ఉన్నట్లు గుర్తించారు. ఈ ‘పెట్రోగ్లైఫ్స్‌’ మధ్యరాతి యుగం నాటి చిత్రాలని తన పరిశోధనలో గుర్తించినట్లు చరిత్రకారుడు సముద్రాల సునీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బొమ్మల్లో ఎడమ చేతిలో త్రిశూలం ధరించి నిలబడిన వేటగాడు పక్కన పెద్దపక్షి ఆనవాళ్లు ఉన్నాయని వివరించారు. తన తాజా అన్వేషణలో ఖిల్లాపై 10 మీటర్ల దూరంలో పెద్దరాతి యుగానికి చెందిన రాళ్ల కుప్ప సమాధులు 36 ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించాలి

యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులు కావాలంటే ఆ రంగాన్ని లాభసాటిగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. అందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు కృషి చేయాలని కోరారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ వేదికగా నిర్వహించిన ‘యూత్‌ యాజ్‌ టార్చ్‌ బేరర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఓరియంటెడ్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా’ కార్యశాలలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రధాన రాష్ట్రంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను ఐటీసీ సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. దీని ధర కేజీ రూ.4.3 లక్షలు. ప్రత్యేకమైన ఫ్యాబెల్‌ ఎక్స్‌క్విజిట్‌ బ్రాండ్‌లో ‘ట్రినిటీ-ట్రఫల్స్‌ ఎక్స్‌ట్రార్డినెయిర్‌’ పేరిట పరిమిత శ్రేణిలో వీటిని ఐటీసీ ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్లుగా ఇవి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాయి. చేతితో తయారుచేసిన చెక్క పెట్టెలో ఇవి లభ్యమవుతున్నాయి. అందులో ఒక్కొక్కటి 15 గ్రాములు కలిగిన 15 విభిన్న ట్రఫల్స్‌ ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సంపదపై నా దృక్పథాన్ని మార్చింది మహాత్ముడే

‘శ్రీమంతులు తమ సంపదకు ట్రస్టీలుగా ఉంటూ, ప్రజలకు మేలు చేసేందుకు ఉపకరించాలన్న మహాత్మా గాంధీ ఆలోచనే, నా మదిలో నిరంతరం పరిభ్రమించేద’ని విప్రో వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. తాను ధనవంతుడిగా మారకముందు నుంచే దీనిపై ఆలోచించే వాడినని ఇక్కడి గుజరాత్‌ విద్యాపీఠ్‌లో విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ ప్రేమ్‌జీ తెలిపారు. 1920లో మహాత్మాగాంధీ ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం 66వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 12 బంతుల్లో..  లాంఛనం పూర్తి

కేవలం 12 బంతుల్లో లాంఛనం ముగిసింది. ఆ రెండు వికెట్లను రెండు ఓవర్లలోనే చేజిక్కించుకున్న టీమ్‌ ఇండియా మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 202 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఖాతాలో మరో 40 పాయిట్లు వేసుకున్న భారత్‌.. ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో తన అగ్రస్థానాన్ని (240 పాయింట్లు) మరింత బలోపేతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ సినిమా చూడటానికి మెదడు అవసరం లేదు

‘ఈ సినిమా చూడటానికి మీ మెదడును వాడకండి. ఎందుకంటే ఇందులో ఎవరికీ మెదడు లేదు’ - ఇది తాజాగా విడుదలైన ‘పాగల్‌పంటి’ సినిమా ట్రైలర్‌లో వినిపించిన సంభాషణ. అందుకు తగ్గట్టే   ఆ ట్రైలర్‌లోని సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి. జాన్‌ అబ్రహమ్‌, అనిల్‌ కపూర్‌, ఇలియానా, కృతి కర్బందా, ఊర్వశి రౌటాలా, అర్షద్‌ వార్సి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.