close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ‘నాన్నా.. నిన్నిలా చూస్తాననుకోలేదు’

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో గల్లంతైన వారి బంధువులు గుర్తిస్తున్నారు. రాయల్‌ వశిష్ఠ బోటు డ్రైవర్‌ నూకరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గుర్తించారు. అలాగే, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కడిపికొండవాసి కొమ్ముల రవీంద్ర మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఆయన జేబులో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా ఆ మృతదేహం ఆయనదేనని నిర్థారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తితిదే బోర్డు ధర్మకర్తల మండలి భేటీ

తితిదే ధర్మకర్తల మండలి భేటీ అయింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు,  దర్శన సంబంధిత సేవలపై కీలకంగా చర్చించనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. తిరుపతిలో గరుడ వారధి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు, పీఆర్వో విభాగంలో పదోన్నతులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పెట్టుబడులు తదితర అంశాలపై నిర్ణయాలుతీసుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీవారి సేవలో గవర్నర్‌ తమిళి సై

వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ప్రారంభ వీఐపీ సేవలో తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ దర్శించుకున్నారు. ఆమెకు తితిదే ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తొలుత వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్‌ ఆతర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శ్రీశైలానికి వరద నీరు.. 10గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు.. తాజాగా బుధవారం ఉదయం మరో ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌ వే ద్వారా మొత్తం పది గేట్లను పది అడుగుల మేరపైకి ఎత్తారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4.60 లక్షల క్యూసెక్కులు కాగా.. స్పిల్‌వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రవాహం స్థిరంగా ఉండటంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తా

తెలంగాణ హోంశాఖలోని రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తాను, జైళ్ల శాఖ డీజీగా రాజీవ్‌ త్రివేదిని నియమించారు. రవిగుప్తా ప్రస్తుతం తెలంగాణ అదనపు పోలీస్‌ డైరెక్టర్‌జనరల్‌(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  పురపాలక ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై దాదాపు స్పష్టత రావడంతో చేపట్టిన ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాదా

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయని సంగతి తెలిసిందే. 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా దాదా నియమితులయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మోదీ మిత్రుల కోసం ప్రభుత్వ సంస్థల అమ్మకం

లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాంకర్‌)ను ప్రధాని మోదీ తన పారిశ్రామిక రంగ స్నేహితులకు కట్టబెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘కంటైనర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా’ యూనియన్‌ సభ్యులను కలిసిన రాహుల్‌.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ సభ్యులు సమర్పించిన పిటిషన్‌ను రాహుల్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పెళ్లి చేసుకున్నాను కానీ..:హేమమాలిని

ధర్మేంద్రను పెళ్లి చేసుకున్నాను కానీ, మొదటి భార్య, కుటుంబం నుంచి నేను ఆయన్ని వేరు చేయలేదు అని అంటున్నారు నటి, ఎంపీ హేమమాలిని. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ‘ధర్మేంద్రను చూసిన మొదటి క్షణంలోనే.. ఆయన సొంతమనిషి వలే అనిపించారు. ఈ జీవితాన్ని ఆయనతో గడపాలనుకున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరూ బాధపడకూడదు అని నిర్ణయిచుకున్నాను’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలోని పాఠశాలలో కాల్పులు

అమెరికాలోని ఒక పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి తన సహచర విద్యార్థిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి కాల్పులు జరుపుతూ పారిపోయాడు. అనుమానిత విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల బయట మరో విద్యార్థితో వాగ్వాదం జరగడంతో అతడు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 10వేల మంది విద్యార్థులు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.ఎడారిలో భారత సైన్యం యుద్ధ విన్యాసాలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.