close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి: అశ్వత్థామ

కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం సమావేశం ముగిసింది. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు, ఐకాస నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అంశాలపై చర్చ జరపాలని కోరామన్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. అసంపూర్తిగా ముగిశాయని తెలిపారు.

2. బలవన్మరణాలొద్దు.. కార్మికులకు బాబు హితవు

పండగ వేళ భవన నిర్మాణ రంగానికి చెందిన మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావు ఆత్మహత్య వార్తలు తనను కలచివేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక కొరతతో పనుల్లేక కార్మికులు బలవన్మరణానికి పాల్పడడం ఆవేదనకు గురిచేస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

3. డిప్యూటీ సీఎంగా దుష్యంత్‌ చౌతాలానే

హరియాణాలో భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. జన్‌నాయక్‌ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన భాజపా.. అందుకు అవకాశమివ్వాలంటూ రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నరైన్‌ ఆర్యను కోరింది. ఇందుకు అంగీకరించిన గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ భాజపాను ఆహ్వానించారు. దీంతో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా దుష్యంత్‌ చౌతాలా ప్రమాణం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

4. ఆర్టీసీ సమ్మె.. కూనంనేని ఆమరణ దీక్ష

తమ డిమాండ్ల సాధనకోసం 22 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మఖ్దూంభవన్‌లో చేపట్టిన ఈ దీక్షను పార్టీ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదని.. ప్రజా రవాణా వ్యవస్థ అని గుర్తించుకోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

5. భారత్‌తో ఒప్పందం ఇంకెప్పుడు..?

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో జాప్యంపై ఆ దేశ ప్రతినిధులు కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో విభేదాలు అమెరికా వ్యాపారస్థులకే నష్టం కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తపరిచారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై పడుతున్న భారం అమెరికా గ్రామీణ వ్యవస్థని కుంగదీస్తోందని తెలిపారు. ఈ మేరకు శనివారం 34మంది ప్రతినిధులు ఆ దేశ వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌హైజర్‌కు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

6. నవాజ్‌ షరీఫ్‌కు గుండెపోటు:పాక్‌ మీడియా

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గుండె పోటు వచ్చినట్టు పాక్‌ మీడియా తెలిపింది. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన్ను లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే, అక్కడే చికిత్స పొందుతున్న ఆయనకు తాజాగా గుండెపోటు వచ్చినట్టు పాక్‌ సీనియర్‌ పాత్రికేయుడు హమీద్‌ మిర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ నీరసంగా కనిపిస్తున్నారని సర్వీస్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

7. ‘భగత్‌సింగ్‌ని భారతరత్నతో గౌరవించండి’

స్వాతంత్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదంపై తిరుగులేని పోరాటం చేసిన ఆనాటి దేశభక్తుల్లో వారు ముగ్గురు స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఆ పోరాటంలోనే వారు అమరులయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికే వారిని ప్రజలు ‘షహీద్‌-ఇ-ఆజం’ బిరుదుతో సత్కరించుకున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

8. ప్రమాదాల్ని ముందే పసిగట్టే కారు

రానున్న తరం అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని వోక్స్‌వ్యాగన్‌ సరికొత్త గోల్ఫ్‌ మోడల్‌ కార్లను విపణిలోకి తీసుకురానుంది. 2020 దశకం అవసరాలకనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ హంగుల్ని పొందుపరిచారు. దీనిలో ప్రమాదాల్ని ముందే పసిగట్టే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం గమనార్హం. కార్‌2ఎక్స్‌ పేరుతో వస్తున్న ఈ ఫీచర్‌ ప్రమాదాల్ని ముందే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

9. వీహెచ్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు

కులాలకు అతీతంగా సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ అన్నారు. బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతుందనే వీహెచ్ మాటలు సరికాదని చెప్పారు. వీహెచ్ మాటలతోనే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓడిందని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వీహెచ్‌పై తక్షణం హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ అధిష్ఠానానికి లేఖ రాశానని, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

10. దుబాయిలో ఘనంగా దీపావళి వేడుకలు 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.