
తాజా వార్తలు
1. బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు: ట్రంప్
ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు. బాగ్దాదీ తనంతట తాను పేల్చుకుని మరణించాడని తెలిపారు. చనిపోయే ముందు బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను హతమార్చాడని ట్రంప్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కొందరు బాగ్దాదీ అనుచరులు కూడా మరణించినట్లు చెప్పారు. అమెరికా సైనికుల్లో ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వంశీ లేఖపై స్పందించిన చంద్రబాబు
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాసిన లేఖపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. లేఖలో వంశీ పేర్కొన్న అంశాలపై స్పందిస్తూ తిరిగి లేఖ రాశారు. ‘‘ఎప్పుడు అన్యాయం జరిగినా తలదించుకోకుండా పోరాటం చేయాలి. ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం మన బాధ్యత. ఈ పోరాటంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటా. వైకాపా వేధింపులను, మీకు జరిగిన అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు
భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జవాన్లతో దీపావళి పండగ జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద బీజీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం వద్ద జవాన్లను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు జవాన్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాకతో తమకు ఈ దీపావళి ఎంతో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. ఆయనను కలిసినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మన్సూరాబాద్ ఇందిరానగర్ కాలనీలో ఉన్న టైర్ల గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైరింజిన్ల సాయంతో మంటల అదుపుచేసేందుకు ప్రయత్నించారు. టైర్ల గోదాము కావడంతో మంటలతోపాటు పొగ కమ్ముకోవడంతో స్థానికులు, ఫైర్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పాక్ వక్ర బుద్ధి.. మోదీ విమానానికి మళ్లీ నో
పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కుటిల బుద్ధిని చాటుకుంది. ప్రధాని మోదీ విమానానికి తమ గగనతలం నుంచి ప్రయాణానికి అనుమతిచ్చేది లేదని ప్రకటించింది. మోదీ సౌదీ పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని మానవహక్కుల ఉల్లంఘనను ఇందుకు కారణంగా చూపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు భారత్ పాల్పడడమే ఇందుకు కారణమని ఖురేషి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రిమోట్ మా చేతుల్లో: సంజయ్ రౌత్
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం తాలూకా రిమోట్ కంట్రోల్ శివసేన చేతుల్లో ఉందని అభిప్రాయపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల కంటే 2019లో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ రిమోట్ తమ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో భాజపా-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సీట్లు వచ్చినప్పటికీ సర్కారు ఏర్పాటులో మాత్రం ప్రతిష్టంభన వీడలేదు. ‘50-50’ ఒప్పందానికి కట్టుబడాలని, అందుకు రాతపూర్వక హామీ ఇవ్వాలంటూ శివసేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆ రోజు అమిత్‌షా-ఉద్ధవ్ భేటీ ఉంటుందా?
భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నట్లు సమాచారం. అక్టోబరు 30న జరగనున్న భాజపా శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ముంబయి రానున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా-ఠాక్రే మధ్య భేటీ జరిగే అవకాశముందని భాజపా ఎమ్మెల్సీ గిరీశ్ వ్యాస్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. ఆలయంలోని బంగారువాకిలికి ఎదురుగా ఉన్న ఘంటామండపంలో శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా ఆశీనులయ్యారు. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనులవారికి... స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదినను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఈ లీగ్‌లో యువీ ఆడటం అద్భుతం: ఆమ్లా
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాక కెనడా గ్లోబల్ లీగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్ తరఫున ఆడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా.. అబుదాబి లీగ్‌లో యువీ ఆడటం సంతోషకరంగా ఉందన్నాడు. ఇలాంటి లీగుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఆడాలని అభిమానులు కోరుకుంటారని, ఇప్పుడు యువీ టీ10 లీగ్ ఆడటం అద్భుతంగా ఉందని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. లాభాలతో ముగిసిన సెన్సెక్స్
దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా జరిగిన ట్రేడింగ్‌లో తొలుత 300 పాయింట్ల వరకూ ఎగబాకిన సెన్సెక్స్.. ముగింపు సమయానికి 194.87 పాయింట్లు పెరిగి 39,250 వద్ద స్థిరపడింది. నిఫ్టి 88 పాయింట్లను సాధించి 11,672కు చేరుకుంది. ఈ సందర్భంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్ సంస్థలకు చెందిన స్టాక్‌లు లాభాల్లో కొనసాగడం మార్కెట్ పెరుగుదలకు కారణమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
