close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. నివేదికలు మావద్ద కూడా దాస్తారా?: హైకోర్టు

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని.. మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే మిగతా అంశాలు ముందుగా చర్చించాలని పేర్కొన్నట్లు తెలిపింది. సమ్మె వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల ఐకాస మధ్య వాదనలు కొనసాగాయి. ఈడీల కమిటీ నివేదికను తమకెందుకు సమర్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు తమ వద్ద కూడా దాచి పెడతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వంశీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా: నాని

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ది తెదేపా డీఎన్‌ఏ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. వంశీని వదులుకొనేందుకు తెదేపా సిద్ధంగాలేదని చెప్పారు. వంశీ మోహన్‌తో మాట్లాడేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదన్నారు. వంశీ తరఫున పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదని నాని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘151సీట్లు ఇచ్చినందుకు అది రిటర్న్‌గిఫ్టా?’

ఏపీ సర్కార్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైకాపా పాలించడానికి పనికిరాదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసుక కొరతను వారికి రిటర్న్‌గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ఆక్షేపించారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.150ల కూలీ కూడా రావడంలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. JKలో పర్యటించనున్న ఈయూ బృందం

యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన సుమారు 25 మంది ఎంపీలతో కూడిన బృందం ప్రధాని నరేంద్రమోదీని సోమవారం కలిసింది. ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిల్‌ డోభాల్‌తో కూడా ఈ బృందం భేటీ అయ్యింది. జమ్మూకశ్మీర్‌ పర్యటన నేపథ్యంలో భాగంగా మోదీ, డోభాల్‌తో ఈ బృందం భేటీ అయ్యింది. మంగళవారం ఈ బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కానుకలిచ్చినందుకు కూడానోటీసులు పంపుతారా?

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై మండిపడ్డారు. స్నేహితులకు కానుకలిచ్చిన విషయమై ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మనీల్యాండరింగ్‌ కేసులో డీకేను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత దిల్లీ హైకోర్టు ఈయనకు బెయిల్‌ మంజూరు చేసింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బ్రెగ్జిట్‌ గడువు మరోసారి పొడిగింపు

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ గడువును మరోసారి పొడిగించారు. అందుకు ఈయూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. తాజా గడువు జనవరి 31తో ముగియనుంది. ఈ మేరకు యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ టస్క్‌ ట్వీట్‌ చేశారు. బ్రెగ్జిట్‌ గడువు పొడిగించాలన్న బ్రిటన్‌ అభ్యర్థనకు ఈయూలోని 27 దేశాలు అంగీకరించాయని తెలిపారు. బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించి ఆమోదం పొంది ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఖైదీ’పై హరీశ్‌ శంకర్‌ ప్రశంసలు

కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా అటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ‘ఖైదీ’ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఖైదీ’ ఒక అద్భుతమైన చిత్రం. పవర్‌ఫుల్‌ స్ర్కీన్‌ప్లేతో ఓ అసాధారణమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తి నటన చాలా బాగుంది. చిత్రబృందానికి నా అభినందనలు.’ అని హరీశ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధన్‌తేరస్‌లో భారీగా వాహనాల కొనుగోళ్లు

దేశంలో ఆటోమొబైల్‌ రంగం కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహీంద్రా సంస్థ ధన్‌తేరస్‌ ఒక్క రోజు 13,500 వాహనాలను డెలివరీ చేసింది. చాల ఆటోమొబైల్‌ సంస్థలు ఆరోజు భారీగా వాహనాలను విక్రయించాయి. గత ఏడాది ధన్‌తేరస్‌తో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కవ. మరోపక్క హ్యూందాయ్‌, బెంజ్‌, ఎంజీ మోటార్స్‌ కూడా భారీగా డెలివరీలు చేశాయి. ‘‘ధనతేరస్‌ పర్వదినం ఒక్కరోజే మా ఆటోమొబైల్‌ విభాగం 13,500 వాహనాలను డెలివరీ చేసింది.’’ అని మహీంద్రా సంస్థ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈడెన్‌టెస్టుకు అంతమందివచ్చినా ఆశ్చర్యపోను

వచ్చేనెల 22న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగబోయే భారత్‌, బంగ్లా టెస్టు మ్యాచ్‌కు తమ దేశం నుంచి 6 వేల మంది వచ్చినా ఆశ్చర్యపోనని బంగ్లా మాజీ సారథి, జాతీయ సెలక్టర్‌ హబిబుల్‌ బషర్‌ అభిప్రాయపడ్డాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈనెల ఆరంభంలో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ అర్హత మ్యాచ్‌కు సుమారు 60 వేల మంది హాజరైనట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమెరికాలో ఫాంటసీ ఫెస్ట్‌ జాంబీ బైక్‌ రైడ్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.