close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ‘బంగారం’ వార్తలపై స్పందించిన కేంద్రం

పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఓ సరికొత్త పథకం తీసుకురానున్నట్లు వస్తున్న వార్తలను ఆర్థికశాఖ వర్గాలు కొట్టిపారేశాయి. బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదని తేల్చిచెప్పాయి. బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అధికారికంగా ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్‌ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరుకానున్నారు. విభజన తర్వాత తొలిసారిగా అధికారికంగా అవతరణ వేడుకలు నిర్వహించనుండటంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సమ్మెపై కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తా: పవన్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని జనసేన కార్యాలయంలో ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు పవన్‌ను కలిసి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. ఐకాస నేతల విజ్ఞప్తిపై పవన్‌ సానుకూలంగా స్పందించారు.  27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధ కలిగిస్తోందన్నారు.  ఈ అంశంపై రెండు రోజుల్లో కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానన్నారు. కేసీఆర్‌ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌ కార్యాచరణకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లెఫ్టినెంట్‌ గవర్నర్ల ప్రమాణ స్వీకారం

గురువారం నుంచి జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గీతా మిట్టల్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము, మాథుర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ లద్దాఖ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఆరోగ్యానికి, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 89 పిటిషన్లను అత్యవసరంగా కొట్టివేయాలని ప్రభుత్వం సింగిల్‌ జడ్జిని కోరింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం కొట్టివేసిందని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు ప్రభుత్వ అభ్యర్థనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయలేదని వాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాటితో అప్రమత్తంగా ఉండండి: ఈపీఎఫ్‌వో

ఉద్యోగులకు తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. ముఖ్యంగా ఈ మధ్య ఫోన్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. పీఎఫ్‌ ఖాతాకు సంబంధించిన యూఏఎన్‌ సంఖ్య సహా ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతా సంఖ్య వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించింది. ఈపీఎఫ్‌ఓ నుంచి వ్యక్తిగత వివరాలు కోరుతూ ఎలాంటి ఫోన్‌ కాల్స్‌, సంక్షిప్త సందేశాలుగానీ రావని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు

తమిళనాడులో మరోసారి జాతీయ దర్యాప్తుసంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. హిందూ కార్యకర్తలే లక్ష్యంగా ఐసిస్‌ ఉగ్రవాదులు దాడులకు కుట్రపన్నినట్లు సమాచారంతో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. తమిళనాడులో 2018లో జరిగిన ఒక దాడికి సంబంధించిన కేసులో  పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. ఆ కేసులో దాఖలుచేసిన ఛార్జిషీట్‌లో పొందుపర్చిన నిందితుల ఇళ్లలో  అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుల్గాం ఘటన:కశ్మీర్‌లో భద్రతపై దీదీ విమర్శలు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రదాడిలో ఐదుగురు కూలీలు మృతిచెందడంపై పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అవి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యలేనని దీదీ ఆరోపించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లోయలో భద్రతా ఏర్పాట్లను ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు చేశారు. ఇటీవల బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఐదుగురు కూలీలు కుల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ధర్మాడి సత్యంకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

రైతులకు సంబంధించిన ఏ ఖర్చుకూ వెనుకాడవద్దని సీఎం జగన్‌ ఆదేశించారని మంత్రి కన్నబాబు తెలిపారు. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికి తీసినందుకు ధర్మాడి సత్యంకు ‘వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు అందజేయాలని సీఎం ఆదేశించారన్నారు. అసామాన్య పనిచేసిన ఒక సామాన్య వ్యక్తికి ఈ తరహా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని చెప్పారు. 

10. చివర్లో అమ్మకాలు.. అయినా లాభాలే

దేశీయ మార్కెట్లు అక్టోబరు డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ముగించాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గడం, దిగ్గజ షేర్లలో త్రైమాసిక ఫలితాల జోరుతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు దూసుకెళ్లాయి. అయితే చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ లాభాలను నిలబెట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ స్వల్పంగా 77 పాయింట్లు లాభపడి 40,129 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11,877 వద్ద స్థిరపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.