close

తాజా వార్తలు

తెలంగాణలో అమల్లోకి కొత్త ఎక్సైజ్‌ విధానం

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి వచ్చింది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానాన్ని పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు గురువారం నాటికి అనుమతుల జారీ ప్రకియను 95శాతం వరకు పూర్తిచేశారు. మిగిలిన కొన్ని దుకాణాలకు ఒకట్రెండు రోజుల్లో లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,216 దుకాణాలకు కొత్తగా లైసెన్స్‌లు పొందిన వ్యాపారులు ఇక నుంచి విక్రయాలు సాగించనున్నారు. 19 డిపోల ద్వారా ఈ దుకాణాలకు మద్యం సరఫరాకు ఎక్సైజ్‌ అధికారులు గురువారం రాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. గత విధానాల్లో స్వల్ప మార్పుల ద్వారా ఈసారి అమ్మకాలు ఆరంభించకముందే ఖజానాకు రూ.1467కోట్ల భారీ మొత్తం సమకూరింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.