close

తాజా వార్తలు

పెళ్లి ఇంట డీజే చిచ్చు

సూర్యాపేట: పెళ్లి ఇంట డీజే చిచ్చు పెట్టింది. పాటల విషయంలో రేగిన గొడవ ఘర్షణకు దారితీసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఇరుకుటుంబాల మధ్య బరాత్‌ విషయంలో వాగ్వాదం తలెత్తింది. త్వరగా ఇంటికి వెళ్లాలని వరుడితరఫు బంధువులు డీజేపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల బంధువులు కర్రలతో, కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకొన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.