
తాజా వార్తలు
1. పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించిన జగన్
ఆరోగ్యశ్రీ పథకాన్ని పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మూడు రాష్ట్రాలకు వర్తింపజేసే పోస్టర్‌ను సీఎం జగన్ శుక్రవారం ఆవిష్కరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో సుమారు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు వైద్యసేవలు నేటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత
గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్ర ఆరేపల్లి నుంచి ప్రారంభమైంది. కరీంనగర్ ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు యత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకుంటున్నారు. డిపో వైపు వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతుండటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బాబు అంత్యక్రియలను ఆయన ఇంటి సమీపంలోని శ్మశానవాటికలోనే పూర్తి చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపో వద్దకు మృతదేహంతో ర్యాలీగా వెళ్తామని ఎంపీ బండి సంజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొందాం: మోదీ
ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు జర్మనీ, భారత్ ద్వైపాక్షిక సహకారంతో పరస్పరం ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్.. భారత ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన విస్తృత చర్చల అనంతరం 11 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతరిక్షం, పౌర విమానయానం, సముద్రపు సాంకేతికత, వైద్యం, విద్య తదితర రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. లవ్లీ యూనివర్శిటీ విద్యార్థినికి జాక్‌పాట్
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ(ఎల్పీయూ)కు చెందిన ఓ విద్యార్థిని జాక్‌పాట్ కొట్టింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న తాన్య అరోరా రూ. 42లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైంది. ఈ ఏడాదిలో ఎల్పీయూ ఇంజినీరింగ్ ఫ్రెషర్ విద్యార్థులకు వచ్చిన ఉద్యోగ ఆఫర్లలో అత్యధిక వేతనం ఉన్న ఆఫర్ ఇదేనని యూనివర్శిటీ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడంపై తాన్య ఆనందం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘నన్ను మహారాష్ట్ర సీఎంను చేయండి’
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడి వారం పూర్తయినా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. మరోవైపు భాజపా- శివసేనల మధ్య మాటల యుద్ధం నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీద్జిల్లా కేజ్ తాలూకా వాద్మౌలీ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ విష్ణు గడాలే అనే రైతు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. భాజపా-శివసేన మధ్య నడుస్తున్న వివాదం సద్దుమణిగే వరకు తనను సీఎంను చేయాలన్నది దాని సారాంశం. ‘భాజపా-శివసేనల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే తీరేలా లేదు. వారి గొడవ సద్దుమణిగే వరకు నన్ను సీఎంను చేయండి’’ అని విజ్ఞప్తి చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 2020 ప్రపంచకప్‌లను ఆవిష్కరించిన కరీనా
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లను బాలీవుడ్ నటి కరీనాకపూర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా వేదికగా 2020లో మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు ప్రపంచకప్ ఈవెంట్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెల్బోర్న్లో నిర్వహించిన కార్యక్రమంలో కరీనా పాల్గొని ప్రపంచకప్‌లను ఆవిష్కరించారు. అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలను పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నిన్నటితో పోలిస్తే, బీఎస్ఈ సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి, 40,165 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,890వద్ద స్థిరపడింది. దీంతో వరుసగా ఆరో రోజూ సూచీలు లాభాలతో ముగినట్లయింది. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగింది. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను కొనసాగించడం మార్కెట్‌కు కలిసొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. జయలలిత బయోపిక్‌లు విడుదల కాకూడదు
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లకు వ్యతిరేకంగా ఆమె మేనకోడలు దీప జయకుమార్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమాలను విడుదల చేయకూడదని కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జయలలిత మరణం తర్వాత ఆమె జీవితం ఆధారంగా సినిమాలు తీయడానికి కోలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ప్రసాద్ ఐమాక్స్‌లో విజయ్ దేవరకొండ సందడి
10. అక్టోబర్ అమ్మకాలు.. మారుతి, మహీంద్ర ఇలా
కొన్నినెలల తర్వాత దేశీయ దిగ్గజ తయారీ సంస్థ మారుతి సుజుకీ (ఎంఎస్ఐ) అక్టోబర్ నెల అమ్మకాల్లో 4.5 శాతం వృద్ధి నమోదు చేసి 1,53,435 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 1,44,277 యూనిట్లను విక్రయించడం గమనార్హం. ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 5.7 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో ఎంఎస్ఐ వెల్లడించింది. దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం&ఎం) అక్టోబర్ నెల అమ్మకాల్లో తగ్గుదల నమోదు చేసింది. అమ్మకాలు 11 శాతం తగ్గి నమోదు చేసిన ఎం&ఎం 51,896 యూనిట్లను విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
