close

తాజా వార్తలు

నాడు ఎంపీపీ...నేడు గ్రామ సచివాలయ ఉద్యోగి

డిజిటల్‌ అసిస్టెంటుగా ఎంపికైన సూర్యారావు

బొడ్డేపల్లి సూర్యారావు

ఓవీపేట(బూర్జ), న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఎంపీపీగా కొద్ది కాలం కిందట వరకు కీలక బాధ్యతలు నిర్వహించి బొడ్డేపల్లి సూర్యారావు(33) నేడు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంటుగా ఉద్యోగాన్ని కైవశం చేసుకున్నారు. ఈయన 2014 జులై 4వ తేదీన ఏకగ్రీవంగా బూర్జ మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుని(ఎంపీపీ)గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై చివరి నాటికి పదవీ కాలం పూర్తైంది. దీంతో రాజకీయంలో స్థిరపడేంత ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ కొలువును సాధించడమే ధ్యేయంగా కృషి చేశారు. సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా డిజిటల్‌ అసిస్టెంటుగా ఉద్యోగాన్ని పొందారు. ఆదివారం ఈ మేరకు జిల్లా కలెక్టరు జె.నివాస్‌ నుంచి ఉద్యోగ ధ్రువపత్రాన్ని అందుకున్నట్లు సూర్యారావు తెలిపారు.

* పేదింట పుట్టి..: సూర్యారావు విద్యాభ్యాసం ఒకటి నుంచి పదో తరగతి వరకు బూర్జ మండలంలోని ఓవీపేటలో జరిగింది. ఇంటర్మీడియేట్‌ను ఆమదాలవలస సాగర్‌ జూనియర్‌ కళాశాలలో, బీటెక్‌ను టెక్కలిలో పూర్తి చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లిదండ్రుల్లో తల్లి ఆదెమ్మ ఆయన 11వ ఏట మృతి చెందింది. తండ్రి అప్పయ్య రోజువారి కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషించారు.

* 2014లో..: 2014లో ఈయన 28వ ఏట బూర్జ ఎంపీపీగా ఎన్నికయ్యారు. దళిత కేటగిరీలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.

ప్రజాసేవే ధ్యేయం: ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి తోడుగా ఉంటూ ప్రజాసేవే ధ్యేయంగా పనిచేయనున్నట్లు సూర్యారావు తెలిపారు. గత అయిదేళ్లలో పార్టీలకు అతీతంగా ప్రజలకు, అధికారులకు దగ్గరగా ఉంటూ అన్ని విధాలా మండలాభివృద్ధికి కృషి చేసినట్లు ఆయన చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.