
తాజా వార్తలు
అమరావతి: పదోతరగతి ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే అబ్దుల్ కలాం పురస్కారాల పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అబ్దుల్ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్ఆర్ పేరిట అందించనున్నట్లు నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్త్రృత చర్చ జరిగింది. దేశానికి ఎంతో సేవ చేసిన అబ్దుల్‌కలాం పేరు మార్చడం ఆయన్ను అవమానించడమేనని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా స్పందించారు. తనకు తెలియకుండా ప్రతిభా పురస్కారాల పేరు మార్చారని ఆగ్రహం వెలిబుచ్చారు. పురస్కరాలను యథాతథంగా అబ్దుల్ కలాం పేరిటే అందించాలని ఆదేశించారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. కలాంతోపాటు గాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
