close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. బార్ల సంఖ్య తగ్గించండి: సీఎం జగన్‌ ఆదేశం

మద్య నియంత్రణ అంశంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. జనవరి 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని.. అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఏపీలో ఆర్టీసీ విలీనానికి అవరోధాల్లేవ్‌: మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి అవరోధాలూ లేవని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకునేందుకు బోర్డు ఆమోదించిందని తెలిపారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఉన్నారని, ఆయన కూడా విలీనానికి అంగీకరించారని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీలో ఆర్టీసీ విలీనంపై ఉండబోదని పేర్ని నాని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అయోధ్యలో పనులు నిలిపేసిన వీహెచ్‌పీ

అయోధ్య స్థల వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న క్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొనసాగుతున్న రాతి శిల్పాలు చెక్కే పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రతినిధి శరద్‌ శర్మ ప్రకటించారు. దశాబ్దాల కాలంగా ఈ సంస్థ ఆలయాన్ని నిర్మాణం చేయాలని డిమాండు చేస్తూ.. దాదాపు 1990 నుంచి రాతి శిల్పాలను తయారు చేయిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రాష్ట్రపతి పాలనకు భాజపా యత్నం: రౌత్‌

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేస్తూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులను భాజపా తెస్తోందని శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటు చేసే స్థితిలో లేకుంటే ఆ విషయాన్ని స్పష్టం చేయాలని, అప్పుడు శివసేన తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి పదవిపై చెరిసగం ఒప్పందానికి శివసేన కట్టుబడి ఉందని, ఉద్ధవ్‌ పార్టీకి చెందిన వ్యక్తే సీఎం అవుతారని పునరుద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. చేతల ప్రభుత్వమని జగన్‌ నిరూపించారు:బొత్స

ఎన్నికల ప్రచారంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నిలబెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని జగన్‌ మరోసారి నిరూపించారని చెప్పారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అయోధ్య కేసు: సెలవులు రద్దు చేసిన ఆర్పీఎఫ్‌

రామజన్మభూమి- బాబ్రీ మసీదుకు సంబంధించిన స్థల వివాదంలో కీలక తీర్పును సుప్రీం కోర్టు వెలువరించనున్న నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని జోన్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. తీర్పు నేపథ్యంలో సిబ్బంది సెలవులు రద్దు చేసి వారిని రైళ్లలో ఎస్కార్టులుగా వ్యవహరించాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం

రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జనవరి నుంచి మే వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్లభాష బోధనపై శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వెంటనే రాష్ట్రపతి పాలన ఉండదు

మహారాష్ట్రలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ గడువు ముగియనున్న దృష్ట్యా, వెంటనే రాష్ట్రపతి పాలన విధించే అవకాశమేమీ ఉండబోదని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పదవిలో కొనసాగుతారని వెల్లడించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఏపీ అసెంబ్లీ కమిటీలు..సభ్యులుగా వీళ్లే

ఏపీ అసెంబ్లీ కమిటీలను శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌ ఖరారు చేశారు. నిబంధనల కమిటీ ఛైర్మన్‌గా స్పీకర్‌ తమ్మినేని, పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి వ్యవహరించనున్నారు. హక్కుల కమిటీ ఛైర్మన్‌గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ, నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబును నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భారత్‌లోకి కొత్త బెంజ్‌ విక్లాస్‌ ఇలైట్‌

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ సరికొత్త ఎంపీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘విక్లాస్‌ ఇలైట్‌’గా పిలిచే ఈ కారు ఎక్స్‌షోరూం  ధర రూ. 1.10 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. భారత్‌లో ఎంపీవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బెంజ్ ఈ కారును తీసుకొచ్చింది. గతంలో విడుదల చేసిన విక్లాస్‌ మోడల్‌కి కొనసాగింపుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.