close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 5 PM

1. సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేశారు. రేపటితో ప్రస్తుత ప్రభుత్వం గడువు ముగియనున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత తొలగింపు!

సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సెక్యూరిటీని తొలగించాలని నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సోనియా సహా ఆమె పిల్లలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇకపై జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత మాత్రమే ఉండనున్నట్లు ఆయన విశ్వసనీయంగా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అలాంటి ఒప్పందమేదీ లేదు: గడ్కరీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత విషయంలో తాను జోక్యం చేసుకోబోనని భాజపా నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. తాను ఆ దిశగా ఎలాంటి చర్చలు జరపడం లేదని..ఏ నేతలతో సమావేశం కావడం లేదని తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరవడంలో భాగంగానే ముంబయికి వచ్చానన్నారు. శివసేన చెబుతున్న 50-50 ఒప్పందమేదీ రెండు పార్టీల మధ్య జరగలేదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. యాత్రికుల ఫీజు విషయంలో పాక్‌ యూటర్న్‌

కర్తార్‌పూర్‌ సందర్శనకు తొలిరోజు వచ్చే యాత్రికుల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయబోమని ప్రకటించిన పాక్‌.. ఈ విషయంలో యూటర్న్‌ తీసుకుంది. తొలిరోజు సందర్శనకు వచ్చేవారు సైతం 20 డాలర్లు ప్రవేశ రుసుముగా చెల్లించాలని పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నోట్లరద్దు ఓ ‘తీవ్రవాద దాడి’: రాహుల్‌

పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ భాజపా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. ‘‘నోట్లరద్దు తీవ్రవాద దాడి జరిగి మూడేళ్లు గడిచింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఎంతో మంది ప్రాణాల్ని బలిగొంది. చిరు వ్యాపారాలను తుడిచిపెట్టేసింది. అనేక మందిని నిరుద్యోగులుగా మిగిల్చింది. ఈ దాడికి కారణమైన వారిని చట్టం ముందుకు తీసుకురావాల్సిందే’’ అంటూ రాహుల్‌ పరోక్షంగా భాజపాపై ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పోలవరం నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలకు  సంబంధించి కేంద్రం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,600 కోట్లలో రూ.1,850 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు త్వరలో నాబార్డు నుంచి నిధులు విడుదల కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

భవననిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్లను తెదేపా బృందం కోరింది. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని సదరు అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఆ ట్రాప్‌లో నేను పడబోను: రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారనీ.. కానీ తాను మాత్రం భాజపా ట్రాప్‌లో పడబోననని స్పష్టంచేశారు. తన గురువు కె.బాలచందర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరుగు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రాచీన కవి తిరువల్లూర్‌ చిత్రాన్ని భాజపా ట్వీట్‌ చేయడంపై చెలరేగిన వివాదంపై స్పందించాలని విలేకర్లు అడగ్గా.. తిరువల్లూర్‌తో పాటు తనపైనా కాషాయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మారిన ‘మూడ్‌’.. 12వేల దిగువకు నిఫ్టీ

వరుస లాభాలతో దూసుకెళ్తున్న మార్కెట్ల జోరుకు అడ్డుకట్ట పడింది. దీంతో సెన్సెక్స్‌ 330 పాయింట్లు కోల్పోయి 40,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ  పాయింట్లు కోల్పోయి 12వేల దిగువకు చేరి 11,908 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.26గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఫ్యాషన్‌రంగంలో సత్తా చాటిన 63ఏళ్ల వృద్ధురాలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.