close

తాజా వార్తలు

ఎయిర్‌ఫోర్స్‌ నుంచి మొబైల్‌ గేమ్‌

రఫేల్‌, తేజస్‌ వంటి యుద్ధ విమానాలతో ఆట

దిల్లీ: భారత వైమానిక దళం ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌-ఎ కట్‌ ఎబౌ’ పేరుతో మొబైల్‌ వీడియో గేమ్‌ను విడుదల చేసింది. ఈ గేమ్‌కు సింగిల్‌ ప్లేయర్‌ వెర్షన్‌ గతంలోనే అందుబాటులోకి రాగా.. తాజాగా మల్టిప్లేయర్‌ వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ మొబైల్‌ గేమ్‌ ఆడుతున్న వారు నిజమైన యుద్ధ విమానాలు ఎగురుతున్న అనుభూతి పొందవచ్చని ఎయిర్‌ఫోర్స్‌ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ గేమ్‌ను వైమానిక దళం వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ హర్జిత్‌ సింగ్‌ అరోడా దిల్లీలో విడుదల చేశారు.

ఈ ఆటలో సింగిల్‌ ప్లేయర్‌ వెర్షన్‌ను అప్పటి ఎయిర్‌ మార్షల్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా గత మేలో విడుదల చేశారు. ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓస్‌ వినియోగదారులు ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఆటలో కనిపించే యుద్ధ విమానాల డిజైన్‌ను తేజస్‌, రఫేల్‌, మిరాజ్‌-2000, ఎస్‌యూ-30 మోడళ్ల తరహాలో రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. వైమానిక దళం గురించి ఆసక్తి ఉన్నవారికి ఈ గేమ్‌ మంచి అనుభూతినిస్తుందని తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.