close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. వర్షిత హత్యపై స్పందించిన సీఎం జగన్‌

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత (6) హత్య ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఇంతటి దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను సీఎం ఆదేశించారు. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌లోని కల్యాణ మండపం వద్ద వర్షిత హత్యకు గురైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దమనకాండను ఖండిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి

సకల జనుల సామూహిక దీక్ష నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద శనివారం జరిగిన దమకాండను ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్ కార్యాయంలో విపక్ష నేతలో కలిసి ఐకాస నేతలు సమావేశమయ్యారు. ట్యాంక్‌బండ్‌ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణ, విపక్షాల మద్దతు కోరటం, రేపు హైకోర్టులో వాదనలు తదితర అంశాలపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపాను వ్యతిరేకిస్తే సేనకు మద్దతిస్తాం

ఏదేమైనా ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తెగేసి చెప్పిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ భాజపాను ఆహ్వానించిన నేపథ్యంలో ఎన్సీపీ పార్టీ నేత నవాబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బల నిరూపణలో శివసేన భాజపాకు అనుకూలంగా ఉండకపోతే ఆ పార్టీకి మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. న్యాయమూర్తులకు విందిచ్చిన జస్టిస్‌ గొగొయ్‌

సీజేఐ జస్టిస్‌ రంజన్ గొగొయ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. చారిత్రక తీర్పు చెప్పిన  నేపథ్యంలో సహ న్యాయమూర్తులకు జస్టిస్‌ గొగొయ్‌ రాత్రి విందు ఇచ్చారు. ధర్మాసనంలోని జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌లకు విందు ఏర్పాటు చేశారు. అయోధ్య తీర్పు ఇచ్చిన వెంటనే ఐదుగురితో కూడిన ధర్మాసనంలోని న్యాయమూర్తులకు విందు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. తర్వాత ఆయన దగ్గరుండి వారిని స్థానిక తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌కు తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైలు దిగుతూ దంపతులు మృతి

విశాఖ జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి దంపతులు మృతి చెందారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా గరివిడి మండల వెదుళ్లవలస గ్రామానికి చెందిన కె.వెంకటరమణారావు(40), మణి(35) దంపతులు శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్తున్న ప్రత్యేక రైళ్లో స్వగ్రామానికి పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున దువ్వాడ స్టేషన్‌కు చేరుకున్నారు. దువ్వాడలో వెంకటరమణ భార్య మణి తల్లిదండ్రులు ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐదేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ గెలిచిన విండీస్‌

ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్‌ జట్టు వన్డే సిరీస్‌ నెగ్గింది. శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీబియన్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌(67; 50 బంతుల్లో 7x4, 3x6), ఎవిన్‌ లూయిస్‌(54; 75 బంతుల్లో 6x4, 1x6) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్‌ 45.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. నజీబుల్లా జద్రాన్‌(56; 66 బంతుల్లో 7x4, 1x6) రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ కరువయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ధనుష్, కార్తిక్‌ సుబ్బరాజ్‌ చిత్రం పూర్తి

రజనీకాంత్‌ హీరోగా ‘పేట’ చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబరులో లండన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాగా 64 రోజుల్లోనే పూర్తి చేశారు. వై నాట్‌ స్టూడియోస్‌ బ్యానరుపై శశికాంత్‌ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదు. ‘పేట’ మాదిరిగానే ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రూ.2 కోసం హత్య

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం వలసపాకలలో దారుణం చోటు చేసుకుంది. రూ. 2 కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్‌లో గాలి నింపించుకునేందుకు వలసపాకలలో ఉన్న సాంబ అనే వ్యక్తికి చెందిన షాప్‌ వద్దకు వెళ్లాడు. గాలి నింపిన తర్వాత సాంబ, సువర్ణ రాజును రూ.2 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆగ్రహించిన సువర్ణరాజు సైకిల్‌షాపు యజమాని సాంబను కొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బెంగాల్‌ని కుదిపేస్తున్న ‘బుల్‌బుల్‌’

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘బుల్‌బుల్‌’ తుపాను పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రాత్రి 8గంటలకు సాగర ద్వీపం దగ్గర బుల్‌బుల్‌ తీరం దాటింది. ఆ ప్రభావంతో దక్షిణ 24పరిగణాల జిల్లాలో ఉద్ధృతంగా గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలుల హోరుకు పెద్ద పెద్ద చెట్లు, హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఇప్పటి వరకు 7,815 ఇళ్లు, 870వృక్షాలు, 950 సెల్‌టవర్లు దెబ్బతిన్నట్లు హోంశాఖ ప్రకటించింది. ప్రజలు బయటకు రావొద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘రన్‌ ఫర్‌ హెల్త్‌’ పేరుతో మారథాన్‌ పోటీ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.