close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. పెళ్లి వేడుకలో విషాదం: నలుగురు మృతి

గోల్నాకలోని పెరల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా,  మరొకరికి తీవ్ర  గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి. 

2. కర్ణాటక ఉప ఎన్నికలు డిసెంబరు 5న..

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను డిసెంబరు 5న నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఫలితాలను అదే నెల 9న విడుదల చేయనున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో నియమావళి నవంబరు 11 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం ప్రారంభమై నవంబరు 18తో ముగియనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి. 

3. భాషా సంఘం ఏం చేస్తోంది: పవన్‌

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ట్విటర్‌లో ఆయన ప్రశ్నించారు. మాతృభాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైకాపా నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి. 

4. ఘనంగా మహ్మద్‌ ప్రవక్త జయంతి వేడుకలు

మహమ్మద్‌ ప్రవక్త జయంతి మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మతసామరస్యానికి ప్రతీకగా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండటం ఎంతో గర్వకారణమని హైదరాబాద్‌లోని బోరబండలో నిర్వహించిన  కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా వేదపండితులు, పాస్టర్లు, ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో అక్కడ భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

5. మహా రాజకీయం: ఉద్ధవ్‌ ఠాక్రేను సీఎం చేయాలి

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారి ఆహ్వానించిన నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తమ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాల్సిందేనని శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను సీఎంను చేయాలంటూ ఆదివారం ఉదయం ఆయన ఇంటి సమీపంలో ఓ హోర్డింగ్‌ వెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

6. ఔను.. మా బౌలర్లకు కాస్త అనుభవం తక్కువ

టీమిండియా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగే నిర్ణయాత్మక మూడో టీ20పై ఇరు జట్లు కన్నేశాయి. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌.. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉందన్నాడు. అలాగే తమ బౌలర్లకు అనుభవం తక్కువున్నా.. మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

7. తెలుగు ‘అసురన్‌’కు దర్శకుడు ఆయనేనా?

టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేష్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ చేస్తున్నారు. దీని తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌ను కూడా ఆయనే చేయనున్నట్లు సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే, దర్శకుడు, ఇతర సాంకేతిక బృందం వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ‘అసురన్‌’ రీమేక్‌ చేసేందుకు పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తుండగా.. ఆ జాబితాలోకి హను రాఘవపూడి వచ్చి చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

8. అలర్ట్‌: ఉ గ్రదాడులు జరిగే అవకాశం

దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం అయోధ్యపై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. భారీ దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఏ సమయంలోనైనా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) సంస్థలకు చెందిన  అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

9. భారత క్రికెటర్‌ షఫాలీవర్మ అరుదైన ఘనత

టీమిండియా మహిళా జట్టు యువ సంచలనం షఫాలివర్మ పొట్టి ఫార్మాట్‌లో అరుదైన ఘనత సాధించింది. విండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో తొలి అర్ధ శతకం బాదింది. దీంతో భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అర్ధశతకం బాదిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

10. జనవరిలో భారత్‌కు ఆడి క్యూ8

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తన వాహన శ్రేణిలో ఎస్‌యూవీ క్యూ8 వాహనాన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. 2025నాటికి దేశంలో తన వాహన విక్రయాలను మరింత బలోపేతం చేసుకునే నేపథ్యంలో భాగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆర్డర్స్‌ను ఆడి ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.