close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు అందిన నివేదిక

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌ నిర్ణయం కోసం పవార్‌, ఉద్ధవ్‌ చూపు!

మరాఠా రాజకీయం రసవత్తరంగా మారింది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేమంటూ కమలనాథులు చెప్పడంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శివసేనను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సాయంత్రం 7గంటల లోపు నిర్ణయం చెప్పాలని డెడ్‌లైన్‌ విధించడంతో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా సేన అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో సంప్రదింపులు జోరుగా కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మీ పిల్లల్ని ఏ మాధ్యమంలో చేర్పించారు?

ఉద్యోగాలు రావాలంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయనీ..  ఆంగ్లం రాకపోతే పోటీని తట్టుకొని నిలబడలేమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామంటే కొందరు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మన పిల్లలు ఆంగ్లం బాగా చదవగలిగితే మంచిది కాదా అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నవాళ్లు.. వాళ్ల పిల్లలను ఏ మాధ్యమంలో చేర్పించారని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేతల ఇళ్ల ముట్టడి.. పోలీసుల కట్టడి

ట్యాంక్‌బండ్‌ వద్ద జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా తెలంగాణ ఆర్టీసీ ఐకాస పిలుపుతో కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కార్మికులు గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీవోఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు

‘వెలుగు’ వీవోఏల గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఏపీ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,297 మంది వెలుగు వీవోఏలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం నుంచి రూ.8 వేలు, గ్రామ సంఘాల నుంచి రూ.2 వేలు చెల్లించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం అదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేం ప్రవేశపెడతామంటే అడ్డుపడ్డారు:లోకేశ్‌

నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని తెదేపా ప్రభుత్వం గతంలో ప్రణాళికలు సిద్ధం చేస్తే సీఎం జగన్‌ అప్పుడు అడ్డుపడ్డారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘మీరు, మీ పవిత్ర పత్రిక గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు.. గుర్తులేదా? నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెదేపా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తే ఆరోజు మీరు అడ్డుపడ్డారు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శివసేన నేత సంజయ్‌ రౌత్‌కు అస్వస్థత

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడిన వేళ శివసేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ  మధ్యాహ్నం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఉదయం నుంచి పలువురు నేతలతో కీలక చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డ్రైవర్‌ తప్పిదం వల్లే ప్రమాదం: ఏజీఎం

నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందించారు. డ్రైవర్‌ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఏజీఎం బి.బి. సింగ్‌ వెల్లడించారు. ఈ ఘటనతో లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొట్టడంతో ఎంఎంటీఎస్‌లోని 6 బోగీలు దెబ్బతిన్నాయని, ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రయాణికుల వాహన అమ్మకాల్లో స్వల్ప పెంపు

కొన్ని నెలలుగా ఆటో రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో అక్టోబరు నెలలో దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు స్వల్పంగా పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే ఇరత విభాగాల ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. మొత్తంగా ఆటో రంగ సంక్షోభం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) తాజా నివేదిక ప్రకారం.. ప్రయాణికుల వాహనాల అమ్మకాలు అక్టోబర్‌లో 0.28శాతం పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్కెట్లకు స్వల్ప లాభాలు

దేశీయ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపించలేదు. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 40,345 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా 5 పాయింట్లు లాభపడి 11,913 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.44గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.