
తాజా వార్తలు
ఏఐతో రూపొందిన సరికొత్త సాధనం
టొరంటో: కార్లలో ఒంటరిగా ఉండిపోయిన చిన్నారులు లేదా పెంపుడు జంతువులను రక్షించడానికి ఒక కొత్త సెన్సర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో తయారైన ఈ సాధనం అలారం మోగించడం ద్వారా పనిచేస్తుంది. కొంత మంది పొరపాటున కానీ, ఇప్పుడే వచ్చేద్దాంలే అన్న ఆలోచనతో కానీ చిన్నారులను, పెంపుడు జంతువులను కార్లలో వదిలి వెళుతుంటారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతుంటారు. ఇది ప్రాణహానికి దారితీయవచ్చు. అలాంటి సమస్యలకు ఈ సాధనం పరిష్కారం చూపుతుంది. ఇందులో రాడార్ పరిజ్ఞానానికి ఏఐని జోడించారు. ఇది అరచేతిలో ఇమిడిపోతుంది. దీన్ని వాహనంలోని రియర్ వ్యూ మిర్రర్‌కు కానీ వాహన పైకప్పునకు కానీ అతికించవచ్చు. ఇది రాడార్ సంకేతాలను ప్రసరింపచేస్తుంది. అవి వాహనంలోని వ్యక్తులు, జంతువులు, వస్తువులను తాకి పరావర్తనం చెందుతాయి. ఇలా తిరిగొచ్చిన సంకేతాలను ఏఐ వ్యవస్థ విశ్లేషిస్తుంది. చిన్నారులు, పెంపుడు జంతువులను వదిలేస్తే గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. ఈ రాడార్ తరంగాలు సీట్ల గుండా కూడా చొచ్చుకెళతాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
