
తాజా వార్తలు
అన్నవరం: కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో సత్యదేవుని గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతోంది. ఈ మహోన్నత ఘట్టంలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారి గిరిప్రదక్షిణ కన్నుల పండువగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు తొలిపావంచల వద్ద పలువురు ప్రముఖులు, దేవస్థానం ఛైర్మన్, ఈవో, ఇతర అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు.
జాతీయ రహదారిపై బెండపూడి గ్రామానికి ముందు పోలవరం కాలువ వెంట ప్రదక్షిణ జరగనుండటంతో ఇబ్బందులు లేకుండా పలు ప్రదేశాల్లో ఇనుప కంచెలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులతో వచ్చే వాహనాలకు పార్కింగ్ కోసం గ్రామంలోని దేవస్థానం కళాశాల ఆవరణను కేటాయించారు. మూడు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. పౌర్ణమి సందర్భంగా మంగళవారం సాయంత్రం పంపా హారతులు, జ్వాలాతోరణం కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి పంపా సరోవరం చెంతనే స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి పంచ హారతులిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిలో తొలిపావంచల వద్దకు తీసుకొచ్చి పూజలు చేసిన అనంతరం జ్వాలాతోరణం కార్యక్రమం జరగనుంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
