close

తాజా వార్తలు

50 శాతం ఉద్యోగాలు మహిళలకే: జగన్‌

అమరావతి: ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ ఎంప్లాయీస్‌’ వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్‌ కార్పోరేషన్‌ను ప్రారంభిస్తున్నామని, పొరుగుసేవల ఉద్యోగాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జీతం ఇచ్చేటప్పుడు ఉద్యోగులను మోసం చేయకుండా, మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు. పొరుగుసేవల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది ఉండాలని, అంతేకాకుండా జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయా శాఖాధిపతుల కమిటీ నుంచి డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితా రావాలని, జనవరి 1 నుంచి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.