
తాజా వార్తలు
శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప ఆలయంలో జరిగే మండల పూజకు భారీ భద్రత ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే అయ్యప్ప మాలధారులకు రక్షణగా, పుణ్యక్షేత్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా మొత్తం 10,017 మంది పోలీసులతో అంచెలవారీ భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. నవంబర్ 15 నుంచి అయ్యప్ప ఆలయంలో పూజలు ప్రారంభం కానుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఆలయం వద్ద చేపట్టే ఈ భద్రతా వ్యవహారాలను సమన్వయ పరిచేందుకు చీఫ్ కోఆర్డినేటర్‌గా ఏడీజీ షేక్ డర్వేష్ సాహేబ్ను నియమించారు. ఈ భద్రతను 112 మంది డీఎస్పీలు, 264 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 1185 మంది ఎస్సై/ ఏఎస్సైలు పర్యవేక్షణలో 8402 సివిల్ పోలీసులు నిర్వహించనున్నారు. వీరిలో 307 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. పండుగ సమయంలో 30 మంది సీఐ, ఎస్సై ర్యాంకు అధికారిణులను కూడా మోహరించాలని అధికారులు యోచిస్తున్నారు.
శబరిమలలో నవంబర్ 15 నుంచి 30 వరకు తొలి దశలో జరిగే వేడుకకు సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎరుమెలి వద్ద 2551 మంది బాధ్యతలు నిర్వహించనున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 వరకు రెండో దశ వేడుకలకు 2539 మంది విధులు నిర్వహించనున్నారు. అలాగే, మూడో దశలో 2992 మంది, నాలుగో దశలో 3077 మంది చొప్పున బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే, సన్నిదానం, నిక్కల్, పంబ వద్ద అదనంగా 1560 మంది ప్రత్యేక బలగాలను కూడా మోహరించాలని నిర్ణయించారు. సన్నిధానం వద్ద మహిళా సిబ్బందిని మోహరించే అంశంపై ఇంకా పోలీసు అధికారులు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
