
తాజా వార్తలు
విజయవాడ: నగర శివారు గొల్లపూడిలో చిన్నారి ద్వారకను హతమార్చిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. చిన్నారిని బలిగొన్న నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహిళల ధర్నాతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు మహిళలకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
Tags :