close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. కర్ణాటక ఎమ్మెల్యేలపై అనర్హత సరైందే..

కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే 2023 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశమిస్తూ ఊరట కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఆత్మహత్యలు

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 40వ రోజుకు చేరినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. మహబూబాబాద్‌ డిపో ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంపై సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో ఆవేదన చెంది కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాచిగూడ ఘటనపై విచారణ ప్రారంభం

కాచిగూడలో ఎంఎంటీఎస్‌ ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌కృపాల్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో స్టేషన్‌ మేనేజర్‌, డివిజన్‌ రీజనల్‌ మేనేజర్‌, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు, ప్రమాద సమయంలో పరిసర ప్రాంతాలవారిని కమిటీ విచారిస్తోంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం ఘటనాస్థలిని కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వెనక్కి తగ్గిన శివసేన

మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరిగి చివరకు రాష్ట్రపతి పాలనకు చేరింది. ఫలితాలు వచ్చి 15 రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టుకోవడంలో పార్టీలు విఫలమవడంతో పాలనా పగ్గాలు కేంద్రం చేతికి వెళ్లాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం అదనపు సమయం ఇవ్వడానికి గవర్నర్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామాల దృష్ట్యా ఈ పిటిషన్‌పై శివసేన వెనక్కి తగ్గింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ కోరట్లేదని ఆ పార్టీ తరఫు న్యాయవాది సునిల్‌ ఫెర్నాండెజ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.  చెల్లింపుల రంగంలోకి ఫేస్‌బుక్‌

సరికొత్త ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు ‘ఫేస్‌బుక్‌ పే’ అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలు సులువైన, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు,  చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనిని  ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ట్రంపరితనమే అందరినీ మేల్కొల్పుతోంది..!’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాతావరణ మార్పులపై వ్యవహరిస్తున్న తీరు ‘చాలా ప్రమాదకరమైంది’ అని పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌ అభిప్రాయపడింది. ఆయన తీరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని మేల్కొలిపి ఒక ఉద్యమానికి దారి తీసిందని వ్యాఖ్యానించింది.  ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీకి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. గత మూడు నెలలుగా ఉత్తర అమెరికాలో తండ్రితో కలిసి అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె యూరప్‌కు బయలుదేరి వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సైనాకు మళ్లీ షాక్‌

వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మరోసారి పరాభవం ఎదురైంది. గతవారం చైనా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన సైనా.. తాజాగా జరుగుతున్న హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ నిరాశపర్చింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 9వ సీడ్‌ సైనా 13-21, 20-22తో  చైనా క్రీడాకారిణి కాయ్‌ యాన్‌ యాన్‌ చేతిలో ఓడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కశ్మీర్‌పై వెనక్కి తగ్గిన బ్రిటన్‌ ప్రతిపక్షం

కశ్మీర్‌ అంశంపై భారత వైఖరికి భిన్నంగా వ్యవహరించిన బ్రిటన్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. అక్కడి భారతీయ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని మార్చుకుంది. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. ఇతర దేశాల వ్యవహారాల్లో ఇకపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ఛైర్మన్‌ ఇయాన్‌ లావెరీ ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భాజపా వల్లే ఈ పరిస్థితి: శివసేన

భాజపా తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే మహారాష్ట్రలో పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు దారితీశాయంటూ శివసేన విమర్శించింది. ఎన్నికల సందర్భంగా శివసేనకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే పరిస్థితులు ఇంత దాకా వచ్చేవి కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు బుధవారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జమ్మూలో ఘనంగా ఝిడీ ఉత్సవం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.