
తాజా వార్తలు
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీ సమ్మె రూట్ల ప్రైవేటీకరణపై మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది.
ఆర్టీసీ సమ్మె వ్యవహారం నిన్న హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇంతకాలం చెప్పిన హైకోర్టు అది సాధ్యం కాకపోవడంతో సమ్మె చట్టబద్ధతను తేలుస్తామని పేర్కొంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నతస్థాయి కమిటీ సమస్య పరిష్కారానికి ఆఖరి అవకాశంగా పేర్కొంది. దీనిపై వైఖరి చెప్పాలంటూ విచారణను నేటికి వాయిదా వేసింది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మెపై పునరాలోచన చేసి 24 గంటల్లో నిర్ణయం చెబుతామని యూనియన్లు వెల్లడించిన విషయం తెలిసిందే.