close

తాజా వార్తలు

మరణంలోనూ వీడని 80 ఏళ్ల బంధం!

ఒకే రోజు లోకం వీడిన శతాధిక దంపతులు

చెన్నై: వారు పుట్టి 100 ఏళ్లు దాటింది. వివాహ బంధంతో ఒకరికొకరై 80 ఏళ్లు గడిచింది. ఇన్నాళ్లు దాంపత్య జీవితం హాయిగా నడిచింది. ఇంతలో ఓ నిండు ప్రాణం దూరమైంది. రెండో ప్రాణం తల్లడిల్లింది. నీవు లేని లోకంలో నేను లేనంది. మృత్యువులోనూ నీ వెంటేనంటూ తనువు చాలించింది. తమిళనాడులో శతాధిక వృద్ధ దంపతులు ఒకే రోజు 30 నిమిషాల వ్యవధిలో మరణించడం స్థానికులను కలచివేసింది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా అలంగుడి తాలూకాలోని ఓ గ్రామంలో వెట్రివేల్‌ (104), పిచాయ్‌ (100) దంపతులు జీవిస్తున్నారు. 80 ఏళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.  సోమవారం వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తన భర్తను విగతజీవిగా చూసి పిచాయ్‌ కూడా కుప్పకూలిపోయింది. వైద్యుడికి చూపించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరి అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు.

వెట్రివేల్‌కు మొత్తం ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉమ్మడి కుటుంబం. మొత్తం 23 మంది మనవలు, వారికి సంతానం కూడా ఉన్నారు. జీవితాంతం ఆదర్శంగా జీవించిన ఈ జంట ఇలా తనువు చాలించడం స్థానికులను కూడా కంటతడి పెట్టించింది. తాత మరణం తట్టుకోలేక నాన్నమ్మ కూడా తమకు దూరమైందని ఓ మనవడు కన్నీటి పర్యంతమయ్యాడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.