
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నరేశ్ మృతికి నిరసనగా.. మహబూబాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జామునుంచే కార్మికులు, అఖిలపక్ష కార్యకర్తలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందగా బంద్ పాటిస్తున్నాయి.
వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహించవద్దంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట బస్‌డిపో ఆవరణలో డ్రైవర్లు కండక్టర్లు యూనిఫారం వేసుకొని నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెక్రసీ నేతలు మద్దతు ప్రకటించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట గంటపాటు బైఠాయించారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు. మహబూబాబాద్‌లో మృతి చెందిన డ్రైవర్ నరేశ్‌కు పలువురు భాజపా నాయకులు నివాళులర్పించారు. కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
