
తాజా వార్తలు
దిల్లీ: శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ స్పందించారు. ఈ నెల 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఆలయంలోకి ఎవరైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తృప్తి దేశాయ్ మాట్లాడుతూ.. శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదు. శబరిమలలో ఎలాంటి వివక్ష లేదని కొందరు అంటున్నారు. అదంతా తప్పు. ఒక ప్రత్యేక ఒక వయస్సు కల్గిన మహిళల ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తున్నారు. నవంబర్ 16న నేను శబరిమల వెళ్తున్నా.’’ అని తెలిపారు. గతేడాది నవంబర్లో అయ్యప్ప ఆలయంలోకి కొందరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శబరిమలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ సమయంలోనే తృప్తి దేశాయ్ కూడా శబరిమల వెళ్లేందుకు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
