close

తాజా వార్తలు

ఆ బిడ్డను న్యాయమూర్తి ఎందుకెత్తుకున్నారు..

నెటిజన్ల హృదయాలను కదిలిస్తున్న వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ కావడాన్ని ఏ స్ర్తీ అయినా వరంగా భావిస్తుంది. ఆమె తన వృత్తి జీవితంలో అడుగు పెట్టే క్షణంలో తన గారాల పట్టి తన దగ్గరే ఉండటం ఒక వర్ణనాతీతమైన అపూర్వ భావన. ఆ తీపిని కళ్లకు కట్టే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ తను న్యాయవాద వృత్తిని స్వీకరిస్తూ ప్రమాణం చేస్తున్న క్షణాన ఆమె బిడ్డను న్యాయమూర్తి ఎత్తుకున్న ఈ వీడియో నిస్సందేహంగా వీక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అమెరికా, వాషింగ్టన్‌ లోని స్టేట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ జడ్జి రిచర్డ్‌ డింకిన్స్‌ ఆ చిన్నారిని ఒక చేత్తో ఆడిస్తూ, జులియానా లామర్‌  అనే మహిళ న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించే ప్రమాణ పత్రాన్ని చదవడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. మహిళలు తమ సంపూర్ణ జీవితాన్ని జీవించే విధంగా చేయూతనివ్వడానికి ఈ చర్య గొప్ప ఉదాహరణ అంటూ న్యాయమూర్తి మానవీయ చర్యను కొనియాడిన నెట్‌ప్రపంచం, జులియానాను హీరో అంటూ పొగుడుతోంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.