close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. రూట్ల పర్మిట్లపై స్టే పొడిగించిన హైకోర్టు

తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. పర్మిట్లపై మధ్యంతర ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సోమవారం వరకు పొడిగించింది. రూట్ల పర్మిట్లపై మంత్రి మండలి నిర్ణయాన్ని అడ్వొకేట్‌ జనరల్‌ సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. మంత్రిమండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శబరిమల దర్శనానికి పేర్లను నమోదుచేసిన మహిళలు 

శబరిమల ఆలయ దర్శనానికి మహిళలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభించింది. ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోవడం కోసం 36 మంది మహిళలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని నీలం సాహ్ని అన్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్‌గా వివిధ హోదాల్లో పని చేశానని గుర్తు చేసుకున్నారు. ఈ రాష్ట్రం నుంచే అన్నీ నేర్చుకున్నానని, మళ్లీ అదే రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అధికారులతో కలిసి పని సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తానని ఆమె అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎలా మాట్లాడాలో జగన్‌కు చెప్పండి: పవన్‌

తనను ‘పవన్‌నాయుడు’ అని వైకాపా స్పందించడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించడం మానుకోవాలని హెచ్చరించారు. ‘ ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదు. కానీ, ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లో ఉంటుంది’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ‘ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి’ అంటూ వైకాపా నేతలపై ఘాటుగా విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపాలో చేరిన దేవినేని అవినాష్‌

యువనేత దేవినేని అవినాష్‌ వైకాపాలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. జగన్‌ అవినాష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఈ మధ్యాహ్నమే తెదేపాకు అవినాష్‌ రాజీనామా చేశారు. తన తండ్రి దేనినేని నెహ్రూ అభిమానుల ఒత్తిడి మేరకు ఆయన వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నారు.

6. బంగ్లా విలవిల: 150కే ఆలౌట్‌

భారత పేసర్ల దెబ్బకు బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు విలవిల్లాడారు. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకు ఆ జట్టు కుప్పకూలింది. సీనియర్‌ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ (43; 105 బంతుల్లో 4×4, 1×6) ఒక్కడే పోరాడాడు. మోమినల్‌ హఖ్‌ (37; 80 బంతుల్లో 6×4), లిటన్‌దాస్‌ (21) మినహా ఎవ్వరూ 20కి పైగా స్కోర్‌ చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇసుక పేరుతో తెదేపా నాటకాలు: పెద్దిరెడ్డి

ఇసుక సమస్యను అడ్డం పెట్టుకొని తెదేపా, జనసేన పార్టీలు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా విజయవాడ బందరురోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పార్థసారథికి మంత్రి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మద్దతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం

అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి దక్కింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డు నటి రేఖకు వరించింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను టి.సుబ్బరామిరెడ్డితో కలిసి టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున మీడియా సమావేశంలో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే: భాజపా

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భాజపా స్వాగతించింది. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు  క్షమాపణలు చెబితే సరిపోదనీ భాజపా సీనియర్‌ నేత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లకుపైగా లాభపడి 40,286 వద్ద ముగియగా.. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,870 వద్ద స్థిర పడింది. ఉదయం స్టాక్‌ మార్కెట్లలో ఊగిసలాట ధోరిణి కనిపించింది. మందకొడిగా మొదలైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో బ్యాకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.