
తాజా వార్తలు
పట్నా: బిహార్ ఐన్‌స్టీన్‌గా పిలిచే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ట నారాయణ్ సింగ్ గురువారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు వచ్చిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు రెడ్ కార్పెట్ పరచడం వివాదానికి దారి తీసింది. విషయం ఏంటంటే.. సింగ్ మృతి చెందిన తర్వాత ఆయన మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం లేక ఆయన బంధువు ఒకరు నానా ఇబ్బందులు పడ్డారు. ఆ దీన పరిస్థితిని ఆయన వివరించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక మేధావి మరణిస్తే ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా కనీస సదుపాయాలు లేవు, కానీ అంత్యక్రియలకు వచ్చిన సీఎంకు రెడ్‌కార్పెట్ పరచడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని బిహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘ఇది వశిష్ట ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది ఇదే దీన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటూ రాష్ట్రంలోని వైద్య సదుపాయాలపై మండిపడింది. ప్రజలు ఉన్నత స్థాయి ఏర్పాట్లను కోరుకోవట్లేదు. ఒక వ్యక్తిని మనిషిగా గుర్తించడాన్ని కష్టంగా భావిస్తున్నారు’ అంటూ పేర్కొంది.
ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడైన వశిష్ట(74) అనారోగ్య కారణాల దృష్ట్యా పట్నా మెడికల్ కళాశాలలో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ప్రకటించించారు. అనంతరం ఆయన హాజరై అంత్యక్రియలకు హాజరై వశిష్టకు నివాళులు అర్పించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీలో సైకిల్ వెక్టార్ స్పేస్ థియరీలో పీహెచ్డీ పూర్తి చేసిన వశిష్ట.. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్, ఐఎస్ఐ కోల్‌కతాలో అధ్యాపకుడిగా సేవలు అందించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
