close

తాజా వార్తలు

తలపై తోక ఉన్న కుక్కపిల్ల ...పప్పీకార్న్‌

కుక్క పిల్ల‌+యూనికార్న్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా అర్ధం లేకుండా మాట్లాడుతుంటే తలా తోకా లేకుండా మాట్లాడుతున్నావు అంటారు. మరి తలమీదే తోక మొలుస్తున్న ఈ కుక్క పిల్లను చూస్తే వాళ్లు ఏమంటారో మరి... చలిలో వణికిపోతూ ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న ఈ కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న స్వచ్ఛంద జంతు సేవా సంస్థ వారికి నోట మాట రానంత పనయింది. అమెరికా, మిస్సోరీలోని మాక్స్‌ మిషన్‌ అనే ఆ సంస్థ వాలంటీర్లు, నుదుటి మధ్యలో మొలుస్తున్న తోకతో ఉన్న ఆ పది వారాల కుక్కపిల్లకు నార్వాల్‌ అని పేరుపెట్టి జాగ్రత్తగా పెంచుతున్నారు. 


ఇది ప్రస్తుతానికి ఆ రెండో తోకను ఊపలేకపోతున్నా, చాలా సీరియస్‌గా ట్రై చేస్తోందట. ‘వుయ్‌ రేట్‌ డాగ్స్‌’ అనే ఈ సంస్థ నార్వాల్‌ ఫోటోలకు, అల్లరి ఆటల వీడియోలను తమ ట్విటర్‌ హాండిల్‌ లో పెట్టింది. దానికి ఫిదా అయ హాలీవుడ్‌ నటుడు బ్రాఫ్‌ తో సహా ఎందరో జంతు ప్రేమికులు, ఫన్‌ లవర్స్‌ ఐదు లక్షల మంది లైకులు కురిపించారు. 
 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.