
తాజా వార్తలు
న్యూయార్క్: మూత్ర పరీక్ష కోసం ప్రయోగశాలలకు వెళ్లాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పరీక్షను నిర్వహించే స్మార్ట్ టాయిలెట్లను మోర్గ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా రూపొందించారు. వ్యక్తుల శరీర జీవక్రియల స్థితిగతులకు సంబంధించిన వివరాలను ఈ టాయిలెట్ల ద్వారా తెలుసుకోవచ్చట! దీనికి సంబంధించిన వివరాలను నేచర్ డిజిటల్ పత్రిక ప్రచురించింది. పరిశోధకుడు జాషువా కూన్ తదితరులు... పది రోజుల్లో 110 శాంపిళ్లను పరీక్షించారు. తాము తయారుచేసిన స్మార్ట్ మూత్రపరీక్ష ద్వారా వారి శారీరక జీవక్రియల్లో వచ్చే మార్పులను గమనించారు. అసిటమినోఫెన్ మందును తీసుకున్న అనంతరం మూత్రాన్ని పరీక్షించగా... అందులో అయాన్ తీవ్రత పెరిగినట్టు స్పష్టంగా గుర్తించారు. వ్యాయామం, నిద్ర తదితరాల వల్ల జీవక్రియల్లో వచ్చే చిన్నపాటి మార్పులను కూడా తమ కొత్త సాంకేతికత పట్టుకుంటోందని వారు తెలిపారు. త్వరలోనే పోర్టబుల్ మాస్ స్పెక్టోమీటర్లను అనుసంధానం చేసి ‘స్మార్ట్ టాయిలెట్’ను మెరుగుపరుస్తామని తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
