
తాజా వార్తలు
1. పోలవరం నిధులు.. ప్రత్యేకహోదా
‘‘పోలవరం ప్రాజెక్టు బకాయిలు రూ.3,223 కోట్లతో పాటు ఆర్అండ్ఆర్ కోసం రూ.10 వేల కోట్లు వెంటనే విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ప్రత్యేకహోదా మన ప్రాధాన్యాంశం. ఏ వేదికలో ఏ చిన్న అవకాశం వచ్చినా లేవనెత్తండి. రెవెన్యూలోటు రూ.18,969 కోట్లు రావాలి. దానికోసం పట్టుబట్టండి’’ అని వైకాపా ఎంపీలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. జాబితా ఇస్తేనే నిధులిచ్చేది
తెలంగాణ రెండు పడకల ఇళ్లకు నిధుల విడుదలలో కేంద్రం కొర్రీ వేసింది. రెండో, మూడో దశల కిందట విడుదల కావాల్సిన రూ.1800 కోట్ల నిధులను ఆపేసింది. ఎనిమిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అభ్యర్థనను తిరస్కరిస్తోంది. ఈ ఇళ్లకు మొదటి వాయిదా కింద దాదాపు రూ.1,200 కోట్లకు పైబడి నిధులను కేంద్రం విడుదల చేసింది. లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో పొందుపరిస్తేనే మిగిలిన నిధులను విడుదల చేస్తామని కేంద్రం కరాఖండిగా చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. స్థానిక ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే ముందుకెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది. ఆ ప్రక్రియను నిలువరించలేమని తేల్చిచెప్పింది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% దాటేందుకు ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లు వీలు కల్పిస్తున్నందున వాటిని రద్దుచేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిలువరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సేనకే పీఠం
రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో భాజపాయేతర సర్కారు కొలువుదీరేందుకు అడుగులు పడుతున్నాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌ల సంకీర్ణాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసేందుకు ఆ మూడు పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భిన్న భావజాలాలున్న ఈ మూడు పార్టీల్లో ప్రభుత్వానికి నేతృత్వం వహించేది మాత్రం శివసేనే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఒకే దేశం.. ఒకే వేతన దినం
సంఘటిత రంగంలో పని చేసే కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ ఒకే రోజు వేతనం లభించేలా చూసేందుకు ‘ఒక దేశం..ఒక వేతన దినం’ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోశ్ గంగ్వార్ చెప్పారు. ఇందు కోసం చట్టం చేయాలని ప్రధాని మోదీ పట్టుదలగా ఉన్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. వైద్యులపై దాడి చేస్తే 10ఏళ్ల వరకూ జైలు!
విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకువచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వైద్యులు, సిబ్బందిని తీవ్రంగా గాయపరిచిన వారికి 3నుంచి 10ఏళ్ల పాటు జైలు శిక్ష, రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకూ జరిమానా విధించాలని ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీ పెంపు!
బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న బీమా కవరేజీని రూ.లక్ష నుంచి మరింత పెంచడానికి ప్రభుత్వం చట్టాలను తీసుకురానుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ఈ చట్టాలను తీసుకురానున్నట్లు ఉందని మంత్రి శుక్రవారం దిల్లీలో విలేకర్లతో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. శ్రీలంక-చైనా బంధంతో భారత్‌కు నష్టం లేదు
శ్రీలంక అధ్యక్ష పదవికి శనివారం జరగనున్న ఎన్నికలను పొరుగున ఉన్న భారత్‌తో పాటు, చైనా కూడా ఆసక్తిగా గమనిస్తోంది. రెండింటితో ఆ దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చైనాతో తమ దేశానికి ఉన్న సంబంధాలను చూసి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీలంక అధ్యక్షుడి సలహాదారు సమన్ వీరసింఘే అన్నారు. భారత్‌తో తమకు స్నేహాన్ని మించిన బంధం ఉందని, రెండు దేశాల సంబంధాలు వెయ్యేళ్లకు మించినవని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఖర్చు తగ్గించేశారు!
సగటు భారతీయుడి వ్యయం 2017-18లో తొలిసారిగా నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి చేరినట్లు లీకైన ఒక ప్రభుత్వ సర్వేనే చెబుతోంది. 2017-18లో ఒక భారతీయుడి సగటు నెలవారీ వ్యయం రూ.1446గా చేరింది. 2011-12లో నమోదైన రూ.1501తో పోలిస్తే ఇది 3.7 శాతం తక్కువ. విచిత్రం ఏమింటంటే గ్రామాల్లో ఈ వినియోగదారు వ్యయం 8.8 శాతం తగ్గగా.. అదే ఆరేళ్లలో నగరాల్లో మాత్రం 2 శాతం పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. యువీ సహా 71 మంది..
ఈసారి ఐపీఎల్ వేలం స్టార్ క్రికెటర్లతో కళకళలాడనుంది. వచ్చే నెల జరిగే ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం అన్ని ఫ్రాంఛైజీలు 71 మందిని వదిలి పెట్టాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. 12 మందిని వదిలేసింది. వీరిలో స్టార్ ఆటగాడు యువరాజ్‌సింగ్ కూడా ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
