
తాజా వార్తలు
దిల్లీ: పాలరాతి కట్టడాన్ని పగటి పూట చూస్తేనే ఎంతో అందంగా ఉంటుంది. అలాంటిదీ పండు వెన్నెల్లో, పిండారబోసినట్లు ఉండే వెలుతురులో చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా!. ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ప్రకృతి, పర్యాటక ప్రియులకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ అందమైన అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు నిన్నే కొత్త వ్యూ పాయింట్‌ను ప్రారంభించింది. దీనికి ‘మెహతాబ్ బాఘ్ తాజ్ వ్యూ పాయింట్’ అని పేరు కూడా పెట్టింది. ఔత్సాహికులు రూ.20 ఫీజు చెల్లించి ఇక్కడి నుంచి వెన్నెల్లో తాజ్ అందాలను వీక్షించవచ్చు. ఉదయం 7నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వ్యూ పాయింట్ నుంచి సందర్శనకు అనుమతినిస్తారు.
ఆ రాష్ట్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ శుక్రవారం ఈ వ్యూ పాయింట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తాజ్ వ్యూ పాయింట్‌ని ఆగ్రా అభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఇలాంటి మరిన్ని వ్యూ పాయింట్లను భవిష్యత్తులో అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు. ప్రస్తుతం దిల్లీలో కాలుష్యం తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. తాజ్ మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే తాజ్ గేట్ల వద్ద ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- కిల్లర్ శ్రీనివాస్‌నూ చంపేయండి!
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఘటనా స్థలికి రానున్న ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
