close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. నిరాహార దీక్ష ప్రారంభించిన అశ్వత్థామరెడ్డి

తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు.ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఊర్మిలానగర్‌లో ఆయన నివాసంలోనే దీక్షకు దిగారు. పోలీసులు అరెస్టు చేసినా పోలీస్‌స్టేషన్‌లోనూ దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం

తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో...పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు ముద్రించటంలో జరిగిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో 63 కేంద్రాల్లో 75,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా...ఇప్పటికే ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పదవులు కాదు.. మానవ సంబంధాలే ముఖ్యం

ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. భాజపా హిందుత్వ విధానాలను అనుసరించదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించడంపై గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యం కాదంటూ శివసేన అధినేతకు చురకలు అంటించారు. ‘ప్రతి పార్టీకి సిద్ధాంతమనేది గుండెవంటిది. మేం దాన్నే పాటిస్తాం. అదే విధంగా మానవ సంబంధాలకు విలువిస్తాం. పదవులకు కాదు’ అని గడ్కరీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ నేతకు ఏడాదిన్నరలో రూ.185 కోట్లు ..! 

కర్ణాటకలో డిసెంబరు 5న ఉపఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆయాపార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అనర్హత వేటు పడి ఇప్పుడు పోటీకి అవకాశం దక్కించుకున్న భాజపా అభ్యర్థి ఎంటీబీ నాగరాజు తన ఆస్తులను నామినేషన్లో వెల్లడించారు. ఆయన అందులో నమోదు చేసిన వివరాలను చూసి ఎన్నికల ప్రధానాధికారి సైతం ఆశ్యర్యపోయారు. గత 18 నెలల్లో నాగరాజు ఆస్తులు ఏకంగా రూ.185 కోట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘నిర్దేశిత సమయంలోనే భారత్‌కు ఎస్‌-400’

ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ నిర్దేశిత సమయంలోగా భారత్‌కు అందజేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. రష్యా నుంచి ఆయుధ కొనుగోలుపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ పుతిన్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ఎస్​-400 క్షిపణులను అందిచడంలో అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. అంతా సవ్యంగానే సాగుతున్నందున.. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మోదీ నుంచి కూడా ఎటువంటి ఒత్తిడి రాలేదు’’ అని పుతిన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘రక్షణ ఇవ్వకపోయినా శబరిమల వెళ్తా’

ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా.. నవంబర్‌ 20 తర్వాత శబరిమలకు వెళ్లి తీరతానని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ అన్నారు. ‘‘నవంబర్‌ 20 తర్వాత నేను శబరిమలకు వెళ్తా. కేరళ ప్రభుత్వం నుంచి రక్షణ కోరతా. అయితే భద్రత కల్పించాలా.. వద్దా అనే అంశాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాను. ఒకవేళ ఇవ్వకపోయినా నేను అయ్యప్ప దర్శనార్థం శబరిమలను సందర్శిస్తా’’ అని తృప్తి దేశాయ్ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మంత్రుల స్థాయిలోనే అమెరికా-చైనా ఒప్పందం

అమెరికా-చైనా మధ్య త్వరలో పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే, ఇది అధ్యక్షుల స్థాయిలో ఉండదని.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని వెల్లడించారు. అయితే, ఎప్పుడు అన్నదానిపై మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతనెల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విధంగా చైనాతో తొలిదశ ఒప్పందానికి జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని ‘నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌’ డైరెక్టర్‌ లారీ కుడ్లో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్రేకప్‌పై పెదవి విప్పిన ఇలియానా

లవ్‌ బ్రేకప్‌పై తొలిసారి గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. ఆమె కొంతకాలం క్రితం లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొన్నినెలల క్రితం విడిపోయారు. తాజాగా ఇలియానా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. దీనిలో భాగంగా తన బ్రేకప్‌, సోషల్‌ మీడియాలో తన ప్రేమ గురించి వస్తున్న ట్రోల్స్‌పై ఇలియానా తొలిసారి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బాయిలర్‌ పేలి నలుగురి మృతి

ఒక ఎన్జీవో సంస్థ కోసం మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌లోని పట్నా సమీపంలోని చంపారన్‌ సుగౌలి బ్లాక్‌లో ఓ ఎన్జీవో సంస్థ కోసం శనివారం తెల్లవారుజామున మధ్యాహ్న భోజనాన్ని తయారీ చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పేలుడు సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారనే సమాచారం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మంచు దుప్పటి కప్పుకున్న గాట్లిన్‌బర్గ్‌ వంతెన


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.