
తాజా వార్తలు
వైరల్ అవుతున్న వీడియో
దిల్లీ: చీకట్లో బైకుపై వెళుతున్న వ్యక్తులపై ఒక చిరుత దూకిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక అటవీశాఖ అధికారి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఒక అటవీ ప్రాంతంలో రాత్రివేళ బైకుపైకి వెళుతున్న మనుషుల్ని దూకి పట్టుకొనేందుకు చిరుత ప్రయత్నించింది. కేవలం కొన్ని అంగుళాల తేడా వారు తప్పించుకున్నారు. చిరుత వారిని వెంబడించకుండానే రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. కొద్ది గంటల క్రితమే షేర్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది.
Tags :