close

తాజా వార్తలు

బలవంతపు బదిలీ.. ఎస్సై వినూత్న నిరసన!

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి తనను బలవంతంగా బదిలీ చేసినందుకు ఉన్నతాధికారిపై వినూత్నంగా నిరసనకు దిగాడు. తన బదిలీకి వ్యతిరేకంగా శుక్రవారం 65 కిలోమీటర్లు పరిగెత్తబోయి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో చోటుచేసుకుంది. విజయ్‌ ప్రతాప్‌ అనే వ్యక్తి అగ్రా పోలీస్‌ లైన్స్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను  ఉన్నతాధికారి అక్కడి నుంచి అగ్రా బిథోలీ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో ప్రతాప్‌ ఆ ఉన్నతాధికారి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ నిరసనకు దిగారు. పోలీస్‌లైన్స్‌ స్టేషన్‌ నుంచి బిథోలి వరకు 65 కిలోమీటర్లు పరిగెత్తడం ప్రారంభించారు. దీంతో మధ్యలోనే మూర్చపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై మాట్లాడిన ప్రతాప్‌.. ‘ అధికారి నా పై నియంతలా వ్యవహరిస్తున్నారు. నన్ను పోలీస్‌లైన్స్‌లోనే ఉండమని మా సీనియర్‌ ఎస్పీ చెప్పినా.. అతను బలవంతంగా బదిలీ చేయించారు. దీన్ని మీరు నా అసంతృప్తి అనుకున్నా సరే నేను పరిగెత్తి తీరుతాను’ అని చెప్పాడు.

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.