
తాజా వార్తలు
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ల తరహాలో జీహెచ్ఎంసీ చలాన్లను త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రోడ్లపై చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసినా, వాల్ పోస్టర్లు అంటించినా వాటిని ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తామన్నారు. ఈ తరహాలో ఒక్క నెలలోనే ఇప్పటి వరకు 1085 నోటీసులు పంపి రూ.1.50 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు తెలిపారు. చలాన్ వేసిన 24 గంటల్లోగా చెత్తను తీసివేయకుంటే జరిమానా మరింత పెరుగుతుందన్నారు. తమకు జరిమానాలే లక్ష్యం కాదని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే తమ మొదటి లక్ష్యమన్నారు. ఇటీవల నగరంలో ప్రత్యేక కార్యాచరణతో 235 టన్నుల నిరుపయోగ వస్తువులను ఇళ్ల నుంచి సేకరించామని వెల్లడించారు. వచ్చే శుక్రవారం నాటికి నగరంలో మొత్తం ఫ్లెక్సీలను తీసివేస్తామన్నారు. తదుపరి ఎవరు ఫ్లెక్సీ పెట్టినా ఫొటో తీసి ఆన్లైన్ ద్వారా జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
