
తాజా వార్తలు
జైపూర్: రాజస్థాన్‌లోని సాంభర్ సరస్సు సమీపంలో వారం వ్యవధిలోనే సుమారు 10 వేల పక్షులు మరణించడం కలకలం రేపుతోంది. వీటిలో దాదాపు అన్నీ వలస పక్షులేనని అధికారులు తేల్చారు. చనిపోయిన పక్షుల తాలుకు అవశేషాలు పరీక్షించగా, విషపూరితమైన ఆహారం తిని మరణించినట్లుగా నిర్ధారణ అయింది. సరస్సు ఒడ్డున చనిపోయి పడి ఉన్న పక్షుల వల్ల మిగతా వాటికి హాని జరగకుండా వాటిని ఏరి వేసేందుకు విపత్తు నిర్వహణశాఖ 70 మందితో బృందాన్ని నియమించింది. అంతేకాక పరిస్థితిని సమీక్షించేందుకు పశు సంవర్థకశాఖ అధికారులను పదుల సంఖ్యలో నియమించారు. తొలుత పక్షుల మరణం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం వల్ల అని అనుమానించారు. కానీ భోపాల్‌కు చెందిన ఓ ప్రయోగశాల విషపూరిత ఆహారం కారణమని నివేదిక విడుదల చేసింది.
శుక్రవారం దీనిపై స్పందించిన రాష్ట్ర హైకోర్టు పక్షుల మరణానికి గల కచ్చితమైన కారణాలను చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. విషపూరిత కారకాలు సరస్సులో ఉండొచ్చనే అనుమానంతో 150 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి తెలిపారు.
సాంభర్ సరస్సు దేశంలోనే అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఏటా శీతకాలం ప్రారంభంలో వేల సంఖ్యలో పక్షులు వివిధ దేశాల నుంచి ఇక్కడికి వలస వస్తుంటాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
