close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం

ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీఎన్‌ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో అశ్వత్థామ స్వీయ నిర్బంధంలో ఉంటూ శనివారం నిరాహార దీక్షకు దిగారు. రెండో రోజూ దీక్ష కొనసాగిస్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సెలైన్‌ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించగా అశ్వత్థామ రెడ్డి నిరాకరించారు. ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీ

తెలంగాణలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి పాతస్థానాలకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌ 5, జోన్‌ 6 పరిధిలో ఉన్న తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొడాలి నానిని ఎందుకు మందలించలేదు?:కళా

తిరుమల శ్రీవారి ఆలయంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. సీఎం జగన్‌ మెప్పు కోసం తిరుమల సంప్రదాయాలను ఉల్లంఘించేలా నాని వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. తితిదే సంప్రదాయాలపై మంత్రి చులకనగా మాట్లాడితే సీఎం జగన్‌ ఎందుకు ఆయన్ను మందలించలేదని కళా ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అన్ని అంశాల్ని చర్చించడానికి సిద్ధం: మోదీ

రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు పార్లమెంటు లైబ్రరీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మొత్తం 27పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘సునీల్‌శర్మ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలి’

తన ఇంట్లో నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్టు అక్రమమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అఫిడవిట్‌లో ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శ్రీవారి లడ్డూ ధర పెంచం: వై.వి.సుబ్బారెడ్డి

శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంచే యోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. లడ్డూ ధరను పెంచుతారనే ప్రచారం అవాస్తవమని చెప్పారు. గత కొన్ని రోజులుగా శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంపుపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

7. భారత్‌కు ఆ సత్తా ఉంది: బిల్‌గేట్స్‌

రాబోయే దశాబ్ద కాలంలో భారత్‌ చాలా వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని, అది కోట్లదిమంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం మరింత పెరిగేందుకు అవకాశం లభిస్తుందన్నారు. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన పనుల పర్యవేక్షణలో భాగంగా మూడు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం: నాగ్‌

నాన్న అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు అలనాటి తారలు శ్రీదేవి, రేఖకు ఏఎన్నార్‌ అవార్డులు ఇస్తున్నామని అగ్ర కథానాయకుడు నాగార్జున చెప్పారు. నాన్న ఉన్నప్పుడు అవార్డులు ఇవ్వలేకోయామన్నారు.  ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘బిన్‌లాడెన్‌ ఏనుగు’ మృతి

కొద్దిరోజుల క్రితం అసోం అటవీశాఖ అధికారులు బంధించిన ‘బిన్‌లాడెన్‌ ఏనుగు’ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందింది. నవంబర్‌ 11న పశ్చిమ అసోంలోని గోల్‌పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ మదపుటేనుగుకు అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బంధించారు.  అటవీ ప్రాంతానికి సమీపంలో నివాసముంటున్న అయిదుగురు వ్యక్తుల ప్రాణాలు బలితీసుకోవడమే దీనిని బంధించడానికి గల ప్రధాన కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మార్చి నాటికి ఆ సంస్థల అమ్మకం పూర్తి

ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం విక్రయం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం సంస్థల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావచ్చు.’’ అని నిర్మల తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.