close

తాజా వార్తలు

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం: అదనపు ఏజీ

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సమ్మె చట్ట విరుద్ధమని అదనపు ఏజీ రామచందర్ రావు వాదించారు. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన కోర్టుకు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం 6 వారాల పాటు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం కోసం ఎదురు చూడాలని కానీ కార్మికులు చట్ట ప్రకారం నడుచుకొలేదని వాదించారు. అదనపు ఏజీ వాదనలపై హైకోర్టు స్పందించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే హక్కు ఎవరికి ఉందని ప్రశ్నించింది. ఆ హక్కు కేవలం కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. కార్మికుల సమస్యలపై స్పందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది కోర్టును కోరగా..కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.