close

తాజా వార్తలు

వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: రాష్ట్ర వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని, వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వెబ్‌సైట్‌ను ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. తొలుత రైతుభరోసా పథకంపై జగన్‌ సమీక్షించారు. ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు రైతు భరోసా కింద లబ్ధి చేకూర్చినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగుచేసుకుంటున్న రైతులనూ రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యవసాయ భూ రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

ñమార్కెట్‌యార్డులకూ ‘నాడు-నేడు’: కన్నబాబు
కనీస మద్దతు ధరలేని చిరు ధాన్యాలు సాగుచేస్తున్న రైతులను ఆదుకోవాలని  సీఎం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణనలోకి తీసుకుని ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటించాలని సీఎం సూచించినట్లు మంత్రి వివరించారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారన్నారు. చిరుధాన్యాలపై ధరల ప్రకటన త్వరలోనే చేయాలని సమావేశంలో నిర్ణయించామని.. చీనీ రైతులకు మంచి ధర వచ్చేందుకు అనుసరించాల్సిన మార్కెటింగ్‌ వ్యూహాలపైనా  సీఎం సమీక్షించినట్లు కన్నబాబు తెలిపారు. మార్కెట్‌ యార్డుల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని.. మార్కెట్‌ యార్డులను కూడా నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 207 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కన్నబాబు చెప్పారు. దీంతోపాటు 56 కొత్త రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.