
తాజా వార్తలు
1. సమ్మెపై నేడు నిర్ణయం!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ముందుకు వెళ్లాలా? వెనక్కు తగ్గాలా? అన్న అంశంపై కార్మిక సంఘాలు మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నాయి. సమ్మె విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు కార్మిక శాఖను సోమవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల ఐకాస నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు నిరాహార దీక్షను విరమించారు. మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టొద్దు
ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్‌ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబుని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టవద్దని స్పష్టంచేశారు. ఇసుక అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు 14500ని సీఎం సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఆయన స్వయంగా ఆ నంబరుకి ఫోన్ చేసి, కాల్‌సెంటర్ ఉద్యోగులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. చంద్రబాబుపై విచారణ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. దాదాపు 14 ఏళ్ల కిందటి కేసులో స్టే తొలగిపోవడంతో కేసును విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని గతంలో నందమూరి లక్ష్మీపార్వతి కేసు వేశారు. దీనిపై అప్పట్లో ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు
తెలంగాణలో నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే చేపడతామని, పండితులు, పీఈటీల ఉన్నతీకరణ సహా ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతుల కాలపట్టికను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. పాత పది జిల్లాలు యూనిట్‌గా పదోన్నతులు కల్పించే ఆలోచన ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. డ్వాక్రా మహిళలకు వారంలోనే రుణం
ఏపీలో డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకు నుంచి రుణం మంజూరు కానుంది. అదీ వారి వ్యక్తిగత ఖాతాలో నేరుగా జమవుతుంది. దరఖాస్తు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. రుణ మంజూరీ ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే పూర్తయ్యేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. స్థానికంలో విజయం మాదే
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి స్థానికసంస్థల పోరులో విజయబావుటా ఎగరేస్తామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఆ తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సోమవారం నిర్వహించిన తెదేపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వైకాపా పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రోజుకు పని గంటలు 9
దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు కనీస పనిగంటలు మారనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న 8 గంటలను 9 గంటలుగా మార్చనుంది. వేతన కోడ్-2019 అమలులో భాగంగా కనీస వేతనాలు, కరవుభత్యం, పనిగంటలు, తదితర కార్మిక హక్కులకు సంబంధించి కేంద్రం నిబంధనలు జారీ చేసింది. కనీస వేతనాల ఖరారుకు ఆరు ప్రమాణాలను నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పాక్ చెరలో తెలుగు వ్యక్తి
అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఇద్దరు భారత జాతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగువాడైన ప్రశాంత్ వైందం కూడా ఉన్నారు. అతడి తండ్రి పేరు బాబూరావు అని సంబంధిత పత్రాలు చెబుతున్నాయి. అరెస్టయిన రెండో వ్యక్తిని మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్గా గుర్తించారు. ఈ నెల 14న బహావుల్‌పూర్‌లో వీరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పాక్ పోలీసులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కాస్త చూసి మాట్లాడవోయ్!
భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ సేవలు ప్రియం కానున్నాయి. డిసెంబరు 1 నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని ఇరు సంస్థలు వేర్వేరు ప్రకటనలో తెలిపాయి. అయితే టారీఫ్ రేట్లను ఎంత మేర పెంచనున్నాయో ఆ వివరాలను రెండు సంస్థలు వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. శ్రీకాంత్ పుంజుకుంటాడా!
వరుస వైఫల్యాలు చవిచూస్తున్న భారత షట్లర్లకు మరో సవాల్.. మంగళవారం నుంచే కొరియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీ. అయితే ఈసారి మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ లేకుండానే మన బృందం బరిలో దిగనుంది. ఈ టోర్నీకి సింధు ముందే దూరం కాగా... తాజాగా సైనా కూడా వైదొలిగింది. దీంతో మహిళల సింగిల్స్‌లో ప్రాతినిధ్యం లేకుండానే భారత్ పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ బరిలో నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
