close

తాజా వార్తలు

భర్తకు టాటా చెప్పి కానరాని లోకాలకు

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

అపర్ణ (మృతదేహం)

దండేపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చారు. మేస్త్రీ పనులు చేస్తూ భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. పనిచేస్తేనే ఆ రోజు పూట గడిచే పరిస్థితి. ఈ క్రమంలో సోమవారం ఛాతిలో నొప్పిగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆ భార్య.. భర్తను అడిగింది. డబ్బులు అందలేదని వచ్చాక వెళ్దామని ఆయన చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన భార్య.. భర్తకు ఫోన్‌ చేసి టాటా..బైబై..నేను వెళ్లిపోతున్నా అని చెప్పి మరీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దండేపల్లి మండలం ధర్మరావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా కోర్చిపాడు మండలం రాచపొడి గ్రామానికి చెందిన బెల్లకొండ అపర్ణ (36) దంపతులు ఏడాది కిందట బతుకుదెరువుకు దండేపల్లి మండలం ధర్మరావుపేట గ్రామానికి వచ్చారు. ఆమె భర్త కిషోర్‌ మేస్త్రీగా పని చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఛాతిలో నొప్పి వస్తుందని అపర్ణ భర్తతో చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడిగింది. అయితే కొత్త ఇంటి పని చేయడానికి బయానా ఇస్తామన్నారని, ఆ డబ్బులు అందగానే వెళ్దామని ఆయన చెప్పారు. సోమవారం ఉదయం భర్త పనికి వెళ్లగా మనస్థాపం చెందిన అపర్ణ మధ్యాహ్న సమయంలో భర్తకు ఫోన్‌ చేసి చెప్పి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టు పక్కల వారు గమనించి హుటాహుటీన లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.