close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. కేబినెట్‌ నిర్ణయం తప్పెలా అవుతుంది?: హైకోర్టు

తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. మోటారు వాహనాల చట్టం సెక్షన్‌-67 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. సెక్షన్‌ 102 ప్రకారం ఏ మార్పు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. అక్రమంగా కేసులు పెడుతున్నారు: చంద్రబాబు

పోలీసు 30 యాక్టు పేరుతో తెదేపా కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమంగా నోటీసులు ఇస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై 13 కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులపై జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సమావేశాలకు హాజరుకాకుండా పోలీసులు వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

‘ఎన్డీయే నుంచి తీసేయడానికి మీరెవరు?’

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విభేదాలు తలెత్తడంతో భాజపాపై విమర్శల దాడికి దిగిన శివసేన మంగళవారం కూడా తీవ్రంగా విరుచుకుపడింది. తన అధికారిక పత్రిక సామ్నాలో హిందూత్వ, జాతీయవాద సిద్ధాంతాలను గుర్తుచేస్తూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ప్రస్తుతం భాజపాలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులెవరూ జన్మించని కాలంలోనే శివసేన హిందుత్వ సిద్ధాంతాలకు మద్దతుగా నిలిచిందన్నారు. ‘అలాంటి మమ్మల్ని ఎన్డీయే నుంచి తొలగించడానికి మీరెవరు’ అంటూ ధ్వజమెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. సీఎం చేతిలో తెలంగాణ నలిగిపోతోంది: భట్టి

రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. న్యాయస్థానం చెప్పిన దాన్ని కూడా పట్టించుకోబోమనే పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరిచే తెలంగాణ సమాజం నేడు  సీఎం కేసీఆర్‌ చేతిలో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రూ.1000తో మొదలై రూ.10లక్షల కోట్ల వైపునకు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో కొత్త శిఖరాలకు చేరింది. ఒక దశలో 3.4శాతం లాభపడి రూ. 1,508.45కు చేరింది. దేశంలోని తొలిసారి రూ.9.5లక్షల కోట్ల మార్కెట్‌ విలువను దాటిన సంస్థగా రికార్డు సృష్టించింది. దీంతో రూ.10లక్షల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న సంస్థగా రిలయన్స్‌ నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.7లక్షల కోట్లు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. స్పీకర్‌ వార్నింగ్‌.. కాంగ్రెస్‌ వాకౌట్‌

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంపై కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభాపతి ఓంబిర్లా విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీజీ భద్రత తొలగిపుపై సమాధానం చెప్పాలని అమిత్‌ షాను కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేయడంతోఆయన సభ నుంచి వెళ్లిపోయారు. దీంతొ కాంగ్రెస్‌ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. దేశవ్యాప్తంగా ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలి

పెట్టుబడి రాయితీ కింద తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నట్లు తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి లోక్‌సభలో తెలిపారు. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఎకరాకు రూ.10వేల రాయితీ ఇవ్వాలని కోరారు. రైతుల ఆదాయం పెరుగుదల అంశంపై లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడి రాయితీ కింద  కేంద్రం మాత్రం ఐదు ఎకరాలకు రూ.6 వేలు మాత్రమే అందజేస్తోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది

అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని భాజపా ఎంపీ తాపిర్‌ గావ్‌ పేర్కొన్నారు. దాదాపు 50-60 కిలోమీటర్ల భూభాగం ఆక్రమణకు గురైందని ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. తక్షణమే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే డోక్లాం తరహా ప్రతిష్టంభన అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ నెలకొనే ప్రమాదముందని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. చికిత్స కోసం షరీఫ్‌ లండన్‌కు తరలింపు

చికిత్స కోసం పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను ఎట్టకేలకు ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా లండన్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం లండన్‌లో నాలుగు వారాల పాటు ఉండేందుకు లాహోర్‌ హైకోర్టు షరీఫ్‌కు అనుమతినిచ్చింది. ఆయన వెంట ఆయన తమ్ముడు షాబాజ్‌ షరీఫ్‌, వ్యక్తిగత ఫిజిషియన్‌ ఉన్నారు. ఆయనను దోహ నుంచి ఖతార్‌ మీదుగా ‘ఎయిర్‌ అంబులెన్స్‌ ’ ద్వారా లండన్‌కు తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కొనుగోళ్లు నడిపించాయ్‌

దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు రాణించాయి. దీనికి తోడు దేశీయంగా బ్యాంకింగ్‌, ఇన్ఫ్రా, ఎనర్జీ రంగాల్లోని దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. నేటి సెషన్‌లో 185 పాయింట్లు ఎగబాకి 40,470 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 56 పాయింట్ల లాభంతో 11,940 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.79గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.