close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏపీ బార్లలో మద్యం సరఫరా వేళలు కుదింపు

రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బార్ల విధానంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బార్లలో మద్యం సరఫరా వేళలను కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం సరఫరా చేయాలని, రాత్రి 11 వరకు ఆహారం సరఫరా చేయాలని సీఎం సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. కోర్టు తీర్పు తర్వాత తుది నిర్ణయం:అశ్వత్థామ

ఆర్టీసీ సమ్మెపై రేపు హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాయని.. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ఐకాసకు అప్పగిస్తూ తీర్మానించాయని చెప్పారు. ఐకాస ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాలన్నీ హామీ ఇచ్చాయని అశ్వత్థామరెడ్డి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. కాంగ్రెస్‌, ఎన్సీపీ సమావేశం రద్దు

శివసేనతో పొత్తు, ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన విధివిధానాలు తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీల ముఖ్యనేతలు మంగళవారం సమావేశం కావాల్సింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తోన్న జయంత్యుత్సవాల పనుల్లో కాంగ్రెస్‌ నేతలు తీరికలేకుండా ఉండడంతో సమావేశం రద్దు చేసినట్లు ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. కార్మికుల ఆత్మహత్యల వ్యాజ్యంపై కౌంటర్‌ 

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ వేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు ఉన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా ప్రభుత్వం తరఫున సీఎస్‌ ఎస్కే జోషి కౌంటర్‌ దాఖలు చేశారు. వ్యాజ్యంలో ప్రభుత్వంపై నిందలు వేసేలా నిరాధారణ ఆరోపణలు చేశారని సీఎస్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. దిల్లీలో కంపించిన భూమి

దేశ రాజధాని సహా లఖ్‌నవూ, ఇతర ప్రాంతాల్లో మంగళవారం భూమి కంపించింది. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు తలెత్తినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉందని, దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.3గా నమోదైనట్లు చెప్పారు.

6. పవార్‌ను అర్థం చేసుకోవాలంటే 100 జన్మలెత్తాలి

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే 100 జన్మలెత్తాల్సి ఉంటుందని శివసేన నేత సంజయ్‌రౌత్‌ అన్నారు.  ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే ప్రశ్నకు సోమవారం శరద్‌పవార్‌ భిన్నమైన సమాధానం ఇచ్చారు. ‘భాజపా-శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీ చేశాయి. మీరు అలా ఎలా అంటారు? వారి(భాజపా-శివసేన) దారి వాళ్లు చూసుకుంటారు. మా రాజకీయాలు మేం చేసుకుంటాం’ అంటూ దాటవేత జవాబిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. 370 రద్దు తర్వాత అల్లర్లు తగ్గాయ్‌

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పోలీసులపైకి రాళ్లు విసిరే ఘటనలు, అల్లర్లు తగ్గాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ‘పోలీసులపైకి రాళ్లు విసరడం, భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి నవంబరు 15 వరకు మొత్తం 190 కేసులు నమోదయ్యాయి. వీటిలో 765 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. 2019 జనవరి 1 నుంచి ఆగస్టు 4 మధ్య 361 కేసులు నమోదయ్యాయి’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

8. ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పెరిగాయ్‌

అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పుంజుకొన్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) పేర్కొంది. గత నెలలో ప్యాసింజర్‌ 2,48,036 వాహనాలు అమ్ముడుపోగా.. గత ఏడాది ఇదే సీజన్‌లో 2,23,498 ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. ద్విచక్రవాహనాల విక్రయాలు 5శాతం పుంజుకొని 13,34,941కు చేరాయి. గత ఏడాది ఇవి 12,70,261 వద్ద ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. దాని వల్ల రెండు పార్టీలకు నష్టం

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై ఇరు పార్టీలను ఉద్దేశించి ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘‘స్వార్థం అనేది మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ అతి కొద్ది మంది మాత్రమే నిస్వార్థంగా ఉంటారు. ఒకే విషయమై వారివురు గొడవపడినట్లయితే ఇద్దరూ ఓటమి చెందాల్సి ఉటుంది’’ అని పరోక్షంగా భాజపా-శివసేనను ఉద్దేశించి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. కార్టోశాట్‌ - 3 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.