
తాజా వార్తలు
నాగ్‌పుర్‌లో వినూత్నంగా నిర్మాణం
కింది వరుసలో వాహనాలు,ఆపై మెట్రో రైలు
ఈనాడు, హైదరాబాద్
నగరంలో పైనుంచి మెట్రో రైలు సాఫీగా వెళుతుంటే కింద రహదారిలో రద్దీ వల్ల వాహనాలు నిదానంగా సాగుతున్న దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి. మెట్రో స్తంభాలనే ఉపయోగించుకుని కింద ఫ్లైఓవర్, ఆపైన మెట్రో మార్గం నిర్మిస్తే ఎలా ఉంటుంది.. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టుగా రహదారులను విస్తరించలేని పరిస్థితుల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణం పరిష్కారంగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో వినూత్నంగా నిర్మిస్తున్న మెట్రో, ఫ్లైఓవర్ల నిర్మాణాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు జియాఉద్దీన్, శ్రీధర్, పురపాలక శాఖ మంత్రి ఓఎస్డీ మహేందర్‌తో పాటు ఎస్ఈలు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు అమలుపై నాగ్‌పుర్ మెట్రోరైలు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
రూ. 8,680 కోట్ల అంచనా వ్యయంతో..
నాగ్‌పుర్‌లో 38.21 కి.మీ. మెట్రోరైలు ప్రాజెక్టును రూ. 8,680 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దేశంలోనే వినూత్నంగా ఒకే స్తంభానికి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మించారు. ఒకదానిపై మరోటి వస్తుంది. మొదటి ఫ్లైఓవర్లో వాహనాల రాకపోకలకు, రెండో ఫ్లైఓవర్లో మెట్రో రైలు ప్రయాణించేలా నిర్మించారు.
40 శాతం తగ్గిన వ్యయం
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌తో భూమి, ఆస్తుల సేకరణ గణనీయంగా తగ్గిపోయింది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వ్యయం తగ్గిందని నాగ్‌పుర్ మెట్రో అధికారులు వివరించారు. ఆస్తుల సేకరణ తక్కువ ఉండటంతో నిర్మాణం వేగంగా చేపట్టడానికి వీలైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనూ ఈ తరహా నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్వీట్ చేశారు.
పీపీపీలో ఎస్టీపీలు.. : నాగ్‌పుర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ)ను అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్‌లోనూ పీపీపీ విధానంలో ఎస్టీపీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు.
నిలువు తోటల పరిశీలన..: నాగ్‌పుర్‌లో నిర్మించిన అండర్‌పాస్‌లలో వర్షపు నీరు చేరకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాలను, నగరంలో ఏర్పాటు చేసిన నిలువు తోటలను ప్రతినిధుల బృందం పరిశీలించింది. నగరాన్ని సందర్శించాలని నాగ్‌పుర్ అధికారులను మేయర్ కోరారు. కాగా ఆయన నేతృత్వంలోని బృందం బుధవారంపుణె నగరాన్ని సందర్శించనుంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
