
తాజా వార్తలు
కేటీఆర్
హైదరాబాద్ : గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద ఈవెంట్‌కు హైదరాబాద్ వేదికైంది. హెచ్ఐసీసీలో ‘ఇండియా జాయ్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నటి నమ్రత, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
‘ప్రపంచస్థాయి స్టూడియోలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ చక్కని వేదికగా మారింది. వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతోంది. యానిమేషన్ వచ్చిన తర్వాత మూవీ మేకింగ్ మరో స్థాయికి చేరింది. సినిమా మేకింగ్‌లో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘బాహుబలి’, ‘ఈగ’, ‘మగధీర’ వంటి సినిమాలు సినిమా రంగాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. 2.3 బిలియన్ ఆక్టివ్ గేమర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఏడాదికి 25% గేమింగ్ ఇండస్ట్రీ వృద్ధి నమోదు చేస్తోంది. గేమింగ్ విభాగం నుంచి రూ.250 కోట్ల ఆదాయం ఉండగా.. ఇది 2020కి మూడు రెట్లు పెరుగుతుందని అనుకుంటున్నాము. ఓటీటీ బ్రాడ్కస్టర్ లోకల్ భాషల్లో కంటెంట్ అందిస్తోంది. చోట భీమ్ అందుకు మంచి ఉదాహరణ. నగరంలో రూ.1000 కోట్ల పెట్టుబడిలో ఇమేజ్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నాము. 2021 లేదా 2022 లో ఇమేజ్ టవర్స్ ప్రారంభమవుతాయి. ఏవీజీసీని విద్యార్థులకు సబ్జెక్ట్‌గా అందించాలని అనుకుంటున్నాము. గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ప్రకటించబోతున్నాము. ఇండియా జాయ్ ద్వారా గేమింగ్ అండ్ మీడియా సెక్టార్‌ని ప్రమోట్ చేయనున్నాము.యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీకి చక్కని డెస్టినేషన్ తెలంగాణ అవుతుంది’ అని కేటీఆర్ అన్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
