close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆంక్షల్లేకుండా ఆహ్వానిస్తే.. సమ్మె విరమిస్తాం

హైకోర్టు సూచన మేరకు కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఐకాస నేతల కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆంక్షల్లేకుండా ఆహ్వానిస్తే.. సమ్మెను విరమిస్తామని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఏపీలో మూడు చోట్ల కాన్సెప్ట్‌ సిటీలు:జగన్‌

విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుపై ఆలోచించాలని..ఒక్కో సిటీ 10 చ.కి.మీ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవినీతి తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. దేశమంతా ఎన్‌ఆర్‌సీ చేపడతాం

జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను దేశమంతా అమలు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. ఎన్‌ఆర్‌సీ అనేది దేశంలోని ప్రజలను పౌరుల జాబితాలోకి చేర్చే ప్రక్రియ మాత్రమేనని, దీనిపై ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని బుధవారం రాజ్యసభలో అన్నారు. ఎన్‌ఆర్‌సీ దేశమంతా నిర్వహించే సమయంలో మరోసారి అసోంలోనూ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని రమేశ్‌

 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెరాస ఎమ్మెల్యే  చెన్నమనేని రమేశ్‌ భారత పౌరత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రమేశ్‌ స్పందించారు. ‘పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. న్యాయం జరుగుతుందని నమ్మకముంది’’ అని చెన్నమనేని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సానుభూతితో వారిని తిరిగి చేర్చుకోండి:పవన్‌

విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నలభై రోజులకిపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రమాదంలో శ్రీశైలం డ్యాం: రాజేంద్రసింగ్‌

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ నిన్న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని, వెంటనే మరమ్మతులు చేయకపోతే పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మంత్రి కొడాలిపై బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదు

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల శ్రీవారి ఆలయంపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ బ్రాహ్మణ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్‌ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద సూర్య, ఇతర నేతలు మంత్రిపై ఫిర్యాదు లేఖ అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఆ సంస్థలు బంగారు బాతుల్లాంటివి :ప్రియాంక

ప్రభుత్వ రంగ సంస్థలు భారత్‌కు బంగారు బాతుల్లాంటివని, అవి దేశానికే గర్వకారణమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం సంస్థలను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఆమె బుధవారం ట్వీట్‌ చేశారు. ‘‘నవ భారతాన్ని నిర్మిస్తామని భాజపా హామీ ఇచ్చింది. కానీ వాళ్లు భారత ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. ఇది దురదృష్టకరం.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స!

శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్స నియమితులు కానున్నారు. తన సోదరుడైన గోటబాయ రాజపక్స దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మహీందా రాజపక్సను దేశ కొత్త ప్రధానిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికార ప్రతినిధి వెల్లడించారు.  ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే గురువారం ఉదయం రాజీనామా చేస్తారనీ.. ఆయన స్థానంలో మహింద రాజపక్స బాధ్యతలు చేపడతారని ప్రభుత్వ అధికార ప్రతినిధి విజయానంద హెరాత్ స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 10లక్షల కోట్లకు మరింత చేరువలో రిలయన్స్‌

దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో రికార్డువైపు దూసుకెళ్తోంది. రూ. 9.5లక్షల కోట్ల మార్కెట్‌ విలువ అధిగమించిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించిన రిలయన్స్‌.. తాజాగా రూ. 10లక్షల కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు రాణించడంతో కొత్త రికార్డుకు కేవలం రూ. 20వేల కోట్ల దూరంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.